Breaking News

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతాలలో పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కడియపు లంక, బుర్రి లంక, కాటన్ బ్యారేజి ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలు నేపథ్యం లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతాలలో పర్యటించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఎన్ జీ టి (జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్) బృంద సభ్యులు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రీజినల్ డైరెక్టరేట్, చెన్నై శాస్త్రవేత్త డి.. సౌమ్య , పర్యావరణ కాలుష్య నియంత్రణ ఇంజనీర్, (కాకినాడ) బిహెచ్ ఎల్ సందీప్ రెడ్డి , ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, మైన్స్ & జియాలజీ, తూర్పు గోదావరి ఎమ్. సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ఈ పర్యటన లో ఇరిగేషన్ హేడ్ వర్క్స్ ఈ ఈ ఆర్. కాశీ విశ్వేశ్వర రావు,  తదితరులు పాల్గోన్నారు.

కాటన్ బ్యారేజి మరమ్మత్తు పనులను పరిశీలించిన కలెక్టరు
అనంతరం బ్యారేజ్ మరమ్మత్తు పనులను పరిశీలించిన కలెక్టర్ మాధవీలత, కోనసీమ జిల్లా కి చెందిన బొబ్బర్లంక, పిచ్చుకల్లంక వద్ద కొన్ని పనులు పెండింగు లో ఉన్నాయనీ, వాటినీ చేపట్టే నిమిత్తం ప్రతిపాదనలు పంపినట్లు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ కి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *