-రాష్ట్రంలో మెరుగైన పరిపాలన వ్యవస్థ కు మొట్టమొదటి సాక్షులు వాలంటీర్లు
-మంత్రి వేణుగోపాలకృష్ణ
కడియం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను, అనుబంధంగా వాలంటీర్ సేవా వ్యవస్థ ను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.
గురువారం కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వాలంటరీలకు వందనం కార్యక్రమానికి మంత్రి వేణుగోపాల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర, పురస్కారాలను అవార్డులను స్థానిక నాయకులు , అధికారులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్లను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను, నగదు ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తోందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశయ సాధనకు , ప్రజల కోసం వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. వరుసగా నాల్గవ ఏడాది వాలంటీర్లకు వందనం పేరుతో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు ప్రధానం చేయడం జరుగుతోందనీ , ఇందులో పాల్గొనడం సంతోషకరమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయాలని పేర్కొన్నారు. అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా సేవా వజ్ర కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 30 వేల రూపాయల నగదు, సేవా రత్న కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 20 వేల రూపాయల నగదు, సేవా మిత్ర కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 15 వేల రూపాయల నగదును అందించి సత్కరించడం జరిగిందని మంత్రితెలిపారు. కడియం మండలంలో 482 మంది వాలంటీర్లకు ప్రోత్సాహాన్ని అందించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
కడియం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల కింద 2,30,455 మంది లబ్ధిదారులకు రు. 196.22 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని గ్రామ ప్రజలకు చేకూర్చడం జరిగిందన్నారు. గాంధీజీ కోరుకున్న సేవా సైన్యం అనే వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమ పాలనను నందిస్తున్నారన్నారు. ప్రతి మారుమూల ప్రాంతంలో నివసించే పేదవానికి సమాజంలో సముచిత స్థానాన్ని కల్పించే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నేరుగా డి బి టి ద్వారా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి స్పష్టం చేశారు.
పేదరికం నిర్మూలించాలనే లక్ష్యంతో నాడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా రు.2.5 లక్షలు వైద్యాన్ని అందించడంతోపాటు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశ పెట్టారన్నారు. నేడుసీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా, అంతకు మించి ఆరోగ్యశ్రీ ని రు.25 లక్షలకు పెంచడంతో పాటు విద్యాభివృద్ధికి నాడు నేడు ద్వారా పాఠశాలల ఆధునికరణ, మౌలిక సదుపాయాలు , అమ్మ ఒడి,విద్యా కానుక విద్యా దీవెన వసతి దీవెన, విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా జగనన్న సంపూర్ణ పోషన ప్లస్ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు కోసం మంచి ఫలితాలను సాధించే దిశగా ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీష్ మీడియాని ప్రవేశ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుంటే, నేడు సీఎం జగన్మోహన్ వాటికి తోడుగా మరో 17 వైద్య కళాశాలను రాష్ట్రంలో నూతనంగా నిర్మించి చరిత్రలో నిలిచారన్నారు. వాలంటీర్ అంటే సేవా సైన్యం అని ప్రజా సేవ చేయడంలో వాలంటీర్ ముందు వరుసలో నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాలంటే పారదర్శకతో, నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడమేనని ఆ దిశగా నా వంతు కర్తవ్యం గా పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రజలకు సేవ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ వాలంటీర్లకు సేవా వజ్ర క్రింద… వాసంశెట్టి అశ్వని, కడియపుసావరం- 2 .. తిన్నాతి కనకరత్నం, పొట్టిలంక – 1,
సేవా రత్న క్రింద… బల్ల లక్ష్మీ, జేగురుపాడు – 2, జగత ఒ.ఎ. కుమారి, కడియం- 3 కిరాయుడు గోవిందు, కడియపుసావరం -2, చాగంటి కిషోర్ బాబు. వేమగిరి – 1, పెందుర్తి పద్మిని, వేమగిరి – 4
సేవా మిత్ర క్రింద…దుళ్ళ – 1, దుళ్ళ – 2, మురమండ, మురమండ -2, యం.ఆర్. పాలెం -1, యం.ఆర్. పాలెం – 2, జేగురుపాడు -1, జేగురుపాడు – 2, దామిరెడ్డిపల్లి, పొట్టిలంక- 1, పొట్టిలంక – 2, కడియపులంక -1, కడియపులంక – 2, కడియపులంక – 3, కడియపులంక – 4,
వీరవరం –1, వీరవరం – 2, వేమగిరి –1, వేమగిరి – 2,వేమగిరి – 3, వేమగిరి – 4, కడియపు సావరం – 1, కడియపు సావరం –2, కడియం -1, కడియం -2, కడియం-3, కడియం – 4 లోని సచివాలయాల్ అవార్డులను అందజేశారు..
కార్యక్రమంలో ఎంపీడీవో జి. రాజ్ మనోజ్, వైయస్ఆర్సిపి
రాష్ట్రా కార్యధర్శి గిరజాల బాబు,
వైయస్ఆర్సిపి మండల అధ్యక్షులు, జెగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి చిన వీరభద్రయ్య,
జె.సి.యస్ కన్వీనర్ తడాల చక్రవర్తి, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ ఈలి గోపాల్ రావు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి టేకి శ్రీనివాస్, మైనార్టీ సెల్ కన్వీనర్ భాషా,
కడియం మాజీ సర్పంచ్ దాసరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.