కలెక్టరేట్ లో ఫిబ్రవరి 24 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 24 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళలో హెచ్ డి ఎఫ్ సీ మేనేజర్స్, ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు , డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ (ప్రొడక్షన్), , సీఐఇ, డిక్సన్ కంపెనీలో టెక్నిషియన్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమో, & డిగ్రీ, బిటెక్ ఉత్తీర్ణులైన 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులు. వీరి అర్హత మేరకు నెలకు రూ.10,000/- నుండి రూ. 30,000/ వరకు జీతం మరియు ఇన్సింటివ్స్, భోజనం, వసతి & రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలకు అనుగుణంగా ఉంటుందన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 24 వ తేదీ శనివారం “వికాస కార్యాలయం, కలెక్టరేట్ (బొమ్మూరు హార్లీక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం” వద్ద ఉదయం 9.30 గంలకు విద్యా అర్హతల సర్టిఫికెట్స్ జెరాక్స్ ల తో నేరుగా హాజరుకావలెనని తెలిపారు. మరిన్ని వివరాలకు www.vikasajobs.com లేదా ఫోన్ నంబర్ 7660823903 ను
సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *