గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యానికి భంగం కల్గించేలా ఉన్న, పరిశుభ్రత పాటించని పానీపూరి బండ్ల నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం ప్రజారోగ్య అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పానీపూరి బండ్ల నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో పానీపూరి బండ్లు కాల్వల పక్కన, అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు చేస్తున్నారాని, నగరంలో ప్రస్తుతం అనారోగ్యాలకు రోడ్ల పక్క పానిపూరి బండ్లు, అరక్షిత ప్రాంతాల్లో విక్రయిస్తున్న తినుబండారాలు కూడా కారణం కావచ్చని, అటువంటి వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రీజినల్ ల్యాబ్ జిఎంసికి సూచించిందని తెలిపారు. ప్రజారోగ్యానికి భంగం కల్గించేలా రోడ్ల పక్కన, కాల్వల పక్కన అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న పానీపూరి బండ్ల నిర్వహకులకు తొలి విడతగా నోటీసులు జారీ చేశామని, త్వరలో స్పెషల్ యాక్షన్ ప్లాన్ ద్వారా అనారోగ్యకర వాతావరణంలో ఉండే పానీపూరి బండ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలో ప్రమాణాలు పాటించకుండా నీటి విక్రయాలు చేస్తున్న 6 మినరల్ వాటర్ ప్లాంట్ లను సీజ్ చేశామని, మరో 56 ప్లాంట్ లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నగర ప్రజలు కూడా తాము కొనుగోలు చేసే త్రాగునీటిని నిర్దేశిత ప్రమాణాలు పాటించే ప్లాంట్ ల్లోనె కొనుగోలు చేయాలని, రోడ్ల పక్కన దుమ్ము ధూళి పడుతూ, కాల్వల పక్కన విక్రయించే పానిపూరిలను కూడా కొనుగోలు చేయవద్దని, లేకుంటే అనారోగ్య సమస్యలను కొనుక్కున్నటే అని సూచించారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …