-ఉత్తమ సేవలు అందించిన గ్రామ వాలంటీర్లను పురస్కారాలతో సత్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని…..
-మే నెలలో సీఎంగా జగన్ ప్రమాణం చేయకుండా ఆపగలిగే శక్తి రాష్ట్రంలో ఏ పొలిటిషన్ కు లేదు….
-వాలంటీర్లకు మంచి రోజులు వస్తాయి…. మంచి వేతనాలు వస్తాయి
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలోని పాల కేంద్రం కమ్యూనిటీ హాల్లో మండల పరిధిలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని మండల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ వాలంటీర్లకు సేవ వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలను అందజేసి, ప్రోత్సాహక నగదు బహుమతులతో సన్మానించారు. సాంకేతిక కారణాలతో అర్హత కోల్పోయిన 6గురు వాలంటీర్లకు 90 వేల సొంత నగదును ప్రోత్సాహకంగా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. తొలుత ఎమ్మెల్యే కొడాలి నానికు, పుష్పగుచ్చాలు అందజేసి మండలంలోని ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం సభలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు, వాలంటీర్లకు అబివాదం చేస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి మేలు చేసే సీఎం జగన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. దొంగ వాగ్దానాలు చెప్పేందుకు మరోసారి ప్రజల వద్దకు చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మవద్దన్నారు.వాలంటీర్లు వైసిపి కార్యకర్తలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి, కానీ మేము అలా అనుకోవడం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు.ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో వాలంటీర్లు ప్రజలకు తెలియజేయాలన్నారు.
వాలంటీర్ల భాగస్వామ్యంతో నేను గెలిచానని జగన్ భావించేలా వాలంటీర్లు కృషి చేయాలని కొడాలి నాని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీపీ సాయన రవి,ఎంపీటీసీలు సీరం రాధాకృష్ణ వేణి,పెనుమాల పూర్ణ కవిత, ఈడే లక్ష్మి ,మెరుగు నాగేంద్రంమండ దిలీప్, ముక్కు సోమేశ్వరరావు , మట్ట కమలసర్పంచ్లు గోసాల జ్యోతి, ముత్యాల జ్యోతి, మేడేపల్లి రవి, వీరనాల లక్ష్మణరావు,కాలిశెట్టి అర్జున్ రావు,మండల బూత్ కమిటీ కన్వీనర్ కోటప్రోలు నాగు ,మండల సచివాలయాల కన్వీనర్ కొత్తూరి లక్ష్మీనారాయణ , వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షుడు పెన్నేరు ప్రభాకర్ రావు,శ్రీ కొండలమ్మ వారి దేవస్థాన కమిటీ చైర్మన్ శేషం గోపి,మండల యువజన విభాగ అధ్యక్షుడు గుదే రవి,వైసిపి నాయకులు పాలేటి చంటి, పెన్నేరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, గుదే రవి, డాక్టర్ ఆర్కె, ఘంటా సురేష్, అబ్దుల్ రహీం , కనుమూరి రామిరెడ్డి, దుగ్గిరాల శేషు,కుటుంబరావు,మహా రెడ్డి మురళి, హనుమంతరావు, సాయన హరి, కోటప్రోలు బాబురావు, పెనుమాల రంగారావు, కొడాలి సుధాకర్, కొమ్మనబోయిన రవిశంకర్, పిన్నమనేని రాఘవేంద్ర, కొడాలి శివ,కుంచపర్తి సాయి, చలమయ్య, చిరంజీవి నందీశ్వర రావు , రేమల్లి ప్రసాద్, నందివాడ మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి,మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.