Breaking News

రైలు పేట స్మశాన వాటిక ఆక్రమణలపై…. దళిత వర్గాల ఆందోళన

-న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ఆశ్రయించిన దళిత వర్గాలు….
-స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి…… ఆక్రమణలు తొలగించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే నాని
-సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన దళిత సంఘాల పెద్దలు…

గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం రైలు పేటలోని దళిత స్మశాన వాటిక స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ దళిత వర్గాలు శుక్రవారం ఆందోళన చేపట్టాయి. ఆక్రమణ సమస్యను దళిత సంఘాల పెద్దలు ఎమ్మెల్యే కొడాలి నాని దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కొడాలి నాని రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి, రైలుపేట స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి ఆక్రమణలు తొలగించాలని సూచించారు. ఎవరు ఆందోళన చెందనవసరం లేదని స్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమితం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొడాలి నాని హామీ ఇవ్వడంతో,ఆయనను కలిసిన ప్రజలు హార్షం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే కొడాలి నానికు దళిత సంఘాల పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *