గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళ ఆర్ధిక సాధికార కత సాధించే దిశగా జగనన్న పాల వెల్లువ కేంద్రాలు జగనన్న ఏర్పాటు చేయడం జరిగిందనీ హోం మంత్రి , గోపాలపురం అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయ కర్త తానీటి వనిత పేర్కోన్నారు. గురువారం చిట్యాల లో బల్క్ మిల్క్ యూనిట్ కి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ది, పేద వర్గాల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేయూత, ఆసరా వంటి పథకాలు ద్వారా ఆర్ధిక పరమైన ప్రయోజనం చేకుర్చమన్నారు. ఆ మొత్తం తో మీ మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అమూల్ పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అమూల్ కేంద్రాల ద్వారా పాల కు సరైన ధర చెల్లించడం ద్వారా దళారుల ప్రేమేయాన్ని నియంత్రించడం జరుగుతున్నట్లు తెలిపారు. చిట్యాల బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా,5 వేల లీటర్ల పాలను శీతలీకరణ చేస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు, నిడదవోలు నియోజక వర్గాల పరిదిలో ఉన్న ఆరు మండలాల కు చెందినా జగనన్న పాల వెల్లువ కేంద్రాలు ద్వారా సేకరిస్తున్న పాలని ఈ కేంద్రంలో శీతలీకరణ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో కొవ్వూరు డివిజన్ పరిధిలో మరో బి ఎమ్ యూ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ జే డి డా ఎస్ జి టి సత్య గోవింద్, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …