-బ్రోచేర్ ఆవిష్కరించిన కలెక్టర్, జెసి, రోటరియన్స్
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వృక్షో రక్షతి రక్షితః’ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని, ఇందులో భాగస్వామ్యం అయ్యే ప్రతీ ఒక్కరు అభినందనీయులని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో ‘వృక్షో రక్షతి రక్షితః’ కార్యక్రమం” లో ముఖ్య అతిథిగా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రోటరీ క్లబ్ అధ్యక్షులు తీగెల రాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లడుతూ, అభివృద్ది పనులు కోసం ప్రత్యేకమైన పరిస్థితులలో రోడ్లు విస్తరణ తదితర పనుల నిమిత్తం కొన్ని వృక్షాలను తొలగించడం జరుగుతోందనీ అన్నారు. అందులో భాగంగా మరిన్ని చెట్లు నాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని పిలుపు నివ్వడం జరుగుతోందనీ అన్నారు. అందులో భాగంగానే తొలగించిన వృక్షాలను సంరక్షించి వేరొక చోట యధావిధిగా వాటినీ నాటడం, సంరక్షించి వృక్ష సంపద కు నష్టం వాటిల్లకుండా రోటరీ క్లబ్, సభ్యులు చేపడుతున్న చర్యలు అభినందనీయం, స్పూర్తి నిచ్చే కార్యక్రమం అన్నారు. గతంలో ఒక మొక్కను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి సంరక్షించినట్లు తెలిపారు. కోరుకొండ దగ్గర ఉన్న సీతారాంపురం గ్రామం నుంచి సుమారుగా 80 సంవత్సరముల వయస్సు పైబడినటువంటి ఒక రావి చెట్టు రెండు మర్రిచెట్టులను, క్లబ్ ప్రెసిడెంట్ Rtn. తీగెల రాజా , ప్రోగ్రాం డైరెక్టర్ కం చైర్మన్ Rtn.రేకపల్లి దుర్గాప్రసాద్ లు ఎన్నో శ్రమల కోర్చి బొమ్మూరు లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాటిని తిరిగి నాటడానికి చేసిన కృషి అభినందనీయం, స్పూర్తి వంతం అన్నారు. రోటరీ క్లబ్ ఐకాన్స్ ను ఎంతో అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని వాటికి తమ పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ Rtn. తీగెల రాజా మాట్లాడుతూ ఈ మూడు చెట్లే కాకుండా, భవిష్యత్తులో కనీసం నెలకు రెండు చెట్లను తీసుకువచ్చి ఏదైనా ఒక సురక్షిత ప్రాంతంలో పాతడానికి ప్రణాళికలు వేస్తున్నామని , అందుకు అయ్యే ఖర్చును రొటీరియన్సే ఒక్కొక్కళ్ళు ఒక చెట్టు కి అగు ఖర్చుని అందిస్తున్నారని బయటివారు కూడా వచ్చి ఆర్థిక తోర్పాట్లు ఇచ్చినట్లయితే వారి సంస్థల పేర్లు కానీ వారి పెద్దలు పేర్లు గాని ఆ చెట్టు వద్ద గ్రానైట్ పలకపై చెక్కించబడునని ఇది శాశ్వతంగా నిలిచిపోయి ఉండనని తెలిపినారు. ఈ మూడు వృక్షాలలలో ఒక వృక్షమును ఎమ్ వి ఆర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ , రోటరీ ఐకాన్స్ క్లబ్బు ఉపాధ్యక్షులు Rtn మండవల్లి వెంకన్న బాబు ఖర్చు చేసినారు. 2, 3 వ వృక్షమును శ్రీ పోలు చిన వెంగళరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె కళ్యాణి పద్మజ స్పాన్సర్ చేసియున్నారు. అలాగే ఈ మూడు వృక్షాలను కూడా తరలించడానికి రీ-ప్లాంటేషన్ చేయటానికి కావలసిన పెద్దట్రాలీస్, పెద్దక్రేన్ ONGC రాజమండ్రి వారు పూర్తిగా సహకరించినారు , ONGC తరఫున ట్రాన్స్పోర్ట్ ఇంచార్జి నాగమల్లేశ్వరరావు వచ్చి ఏర్పాట్లు పరివేక్షించినారు, ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , ప్రెసిడెంట్ Rtn. తీగెల రాజా , సెక్రెటరీ Rtn.అను కుమార్ , ట్రెజరర్ Rtn. గ్రంధి రాజా , జాయింట్ సెక్రెటరీ Rtn. జాన్ కమిడి , వైస్ ప్రెసిడెంట్ Rtn. వెంకన్న బాబు , సెక్రెటరీ Rtn పి అను కుమార్, ట్రెజరర్ Rtn జి రాజా వైస్ ప్రెసిడెంట్ Rtn మండవిల్లి వెంకన్న బాబు , క్లబ్ డైరెక్టర్ లు రొటీరియన్స్ , పాల్గొనడం జరిగిందన్నారు.