Breaking News

“దృవీకరణ పర్రాల జారీ’పై ప్రత్యేక సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మున్సిపల్ అధికారులు, పంచాయత్ అధికారులు మరియు రిజిస్ట్రేషన్ అధికారులతో “దృవీకరణ పర్రాల జారీ’పై ప్రత్యేక సమావేశం మరియు పారా లీగల్ వాలంటీర్ లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ . గంధం సునీత మాట్లాడుతూ ఎ పి స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలకు చట్టాల పై అవగాహన కల్పించడంలో భాగంగా జనన, మరణ, వివాహ, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాలు మరియు వాటి ప్రాముఖ్యత గురుంచి సంబంధిత ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలకు వివరించారు. ధృవీకరణ పత్రాలు లేకపోవడం వలన కలిగే ఇబ్బందులను వివరించారు. ధృవీకరణ పత్రాలు జారీ చేయుటలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ విషయంలో ఏ విధమైన న్యాయ సహాయం అవసరమైన , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ను సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమం లో రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి బి పద్మ మాట్లాడుతూ , జనన మరణాల నమోదు చట్టం, 1969 మరియు ఆంధ్రప్రదేశ్ జనన మరణ నిబందనల నమోదు చట్టం, 1999 పై అవగాహన కల్పించారు. ఎం హెచ్ ఓ డా.  ఏ. వినూత్న, సబ్ రిజిస్ట్రార్  కె. కమల ప్రియ లు మాట్లాడుతూ జనన, మరణ మరియు వివాహల నమోదు ప్రక్రియను వివరించారు. అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ విలియం కేరి మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం, లీగల్ సర్వీసెస్ ప్రజలకు చేరువ చేయడంలో పారా లీగల్ వాలంటీర్ ల యొక్క పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ అధికారులు, పంచాయత్ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు, పారా లీగల్ వాలంటీర్లు మరియు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *