రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారము సాయంత్రము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి గ్రూప్ II పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు; రెవెన్యూ (ఎ) III దశ రీ-సర్వే; (బి) ఇనామ్ & అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్; (సి) ఇంటి స్థలాల నమోదు; హౌసింగ్ – హౌసింగ్ నిర్మాణం; పంచాయితీ రాజ్, ఉపాధిహమీ , ప్రాధాన్యత భవనాలు; ఆరోగ్యం, వైద్యం & కుగ్రూప్ II పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు; రెవెన్యూ (ఎ) III దశ రీ-సర్వే; (బి) ఇనామ్ & అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్; (సి) ఇంటి స్థలాల నమోదు; హౌసింగ్ – హౌసింగ్ నిర్మాణం; పంచాయితీ రాజ్, ఉపాధిహమీ , ప్రాధాన్య భవనాలు; ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం – (ఎ) జగనన్న ఆరోగ్య సురక్షపై కలెక్టర్ల అభిప్రాయం; (బి)ఆరోగ్య శ్రీ సాచురేషన్ కార్డ్ పంపిణీ; పై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లడుతూ, జిల్లాలో గ్రూప్ పరిక్షల నిర్వహణకు సంబంధించిన అవసరమైనా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో,53 కేంద్రాలలో 18501 మంది హజరు కానున్నట్లు తెలిపారు. ఇన్విజిలేటర్ లని, ఫ్లయింగ్ స్వాడ్ లను, పోలీసు, ఇతర అనుబంధ అధికారులని, సిబ్బందిని నియమించామన్నారు. ఉపాధిహామీ పథకం కింద 48 లక్షల పనిదినాలకి గానూ46 లక్షల ఏడు వేల పని దినాలు సాధించినట్లు తెలిపారు. మార్చి నెలలో సాధించాల్సిన లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో పనుల గుర్తింపు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …