Breaking News

నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు కేటాయింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కి బకెట్ గుర్తు ఎలక్షన్ కమిషన్ కేటాయించిందని వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ తెలియజేశారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ విజయవాడ ఎంపీ గా పోటీ చేస్తున్నానని, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులుగా న్యాయవాది గోపాల కృష్ణమూర్తి పోటీ చేస్తున్నా రని, బకెట్ గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నారని అన్నారు. ఈ సందర్భంగా “మేనిఫెస్టో” కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఎడారిలో ఎండ మావు లాంటిది మన అభివృద్ధి 77 సంవత్సరాల స్వాతం త్రం సిద్ధించిన, దశాబ్దాలు గడిచిన, మారని మన బ్రతుకులు దశాబ్దాలు గడిచినాఎవరో వస్తారని ఏదో చేస్తారని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గంపెడు ఆశతో ఎదురు చూస్తూ రాజకీయ నాయకుల పార్టీలు, ప్రభుత్వాల ఆలోచన ద్వారా మరియు విధానాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు అమాయకత్వాన్ని ఓట్లుగా మలుచుకుని రాజకీయ నాయకులు గద్దినెక్కి మొండి చెయ్యి చూపడమే నాయకుల పార్టీలు విధానంగా మారిందని, ఆయన పార్టీలను రాజకీయ నాయకులను దుయ్యబట్టారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లీగల్ సెల్ సభ్యులు గోపాలకృష్ణ మూర్తి మాట్లాడుతూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులుగా సీట్ ఇచ్చారని బకెట్ గుర్తుపై వచ్చే ఎన్నికల్లో ఎన్నికలలో పోటీ చేస్తున్నానని అన్నారు.. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్.. రామయ్య, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *