Breaking News

స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ మరియు స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్మార్ట్ సిటీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 33వ సమావేశం మెటర్నరీ హాస్పిటల్ సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానంలో కలెక్టర్ మరియు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ జి. లక్ష్మీశ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పురోగతిలో ఉన్న 25 పనులు, శ్రీనివాస సేతు పనులు త్వరితగతిన పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులు మంజూరు కాబడిన పనుల వివరములను సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ కలెక్టర్ గారికి తెలియజేసారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ లు అయిన ఎస్పీ శ్రీమతి మలికా గర్గ్, తుడా వి.సి వెంకట నారాయణ,APUFIDC మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బి.హరిత, భారత ప్రభుత్వం నుండి నామినేట్ చేయబడిన డైరెక్టర్ రవిచంద్ర, అండర్ సెక్రటరీ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీమతి డాక్టర్ రమాశ్రీ, డాక్టర్ బి. రామచంద్ర రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ వి.ఆర్. చంద్ర మౌళి పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *