-గత ఎన్నికల్లో తక్కువ ఓటు శాతం నమోదు అయిన పి ఏస్ వారీగా ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి
-బి ఎల్ వో లు ఇంటింటికి తిరిగి చైతన్యం తీసుకుని రావాలి
-ఈ వి ఎమ్ లపై అవగాహన కల్పించాలి
-ఓటర్ల తో కలెక్టర్ ముఖాముఖి సంభాషణ
-కె. మాధవీలత
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని , ఆమేరకు ఓటర్ల లో అవగాహన పెంచాల్సి ఉందని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం రాజానగరం నియోజక వర్గం పరిధిలో దీవాన్ చెరువు, లాలా చెరువు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ గా నమోదు అయిన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో గత ఎన్నికల్లో నియోజక వర్గాల వారీగా తక్కువ ఓటు నమోదు చేసిన పి ఎస్ లను గుర్తించి, అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ను చెప్పట్టాల్సి ఉందన్నారు. రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అందులో భాగంగానే గత సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం నియోజక వర్గంలో దివాన్ చెరువు , లాలా చెరువు మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాలల పరిధిలోని పి ఎస్ లలో ఓటింగ్ 65 శాతం కంటే తక్కువ నమోదు కావడం జరిగినదని పేర్కోన్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసెందుకు పర్యటించినట్లు పేర్కోన్నారు. ఓటర్ల లో చైతన్యం తీసుకుని రావడం కోసం తగిన ప్రణాళికలు, కార్యచరణ సిద్ధం చెయ్యాలని అధికారులని ఆదేశించారు. బి ఎల్ వో లు ఇంటింటికి తిరిగి చైతన్యం తీసుకుని రావాలన్నారు. ఇప్పటికే ఈ వి ఎమ్ లపై అవగాహన కల్పించడం జరిగిందనీ, రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. లాలా చెరువు పరిధిలోని 142, 143, 144, 146 , 147 , దివాన్ చెరువు పరిధిలోని 136 , 137 పొలింగ్ కేంద్రాల్లో ఓటింగు శాతం పై బూత్ వారీగా సమీక్ష నిర్వహించారు
కలెక్టర్ వెంట రాజానగరం ఆర్ వో / రాజమండ్రీ ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి , తహసీల్దార్ జీ. కనక రాజు, బి ఎల్ వో లు, తదితరులు పాల్గొన్నారు.