తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
2023-24 సం. కు గాను వైయస్ఆర్ రైతు భరోసా – పి.యం కిసాన్ కింద వరుసగా ఐదో ఏడాది మూడవ విడత నగదు బదిలీ చేయు కార్యక్రమమును గౌ. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించి బటన్ నొక్కి నేరుగా నేడు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేసారని జిల్లాలో 1,80,763 మంది భూ యజమాని రైతులకు, కౌలు, ROFR సాగు రైతులకు రూ.36.29 కోట్ల లబ్ది, డా. వై ఎస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద రూ. 3.93 కోట్ల రూపాయల లబ్ది చేకూరిందని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా తిరుపతి జెసి గారు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సెరికల్చర్ తదితర అనుబంధ శాఖల అధికారులు, రైతులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మన తిరుపతి జిల్లాలోనే 2019 నుండి 2022 వరకు 176345 రైతు కుటుంబాలకు 927 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సంవత్సరం 2023-24 సం.కు గాను తిరుపతి జిల్లాలో మూడవ విడతలో సొంత భూమి కలిగిన రైతులు 178646 మందికి రూ.35.73 కోట్లు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ 430 మంది రైతులకు రూ 0.086 కోట్లు, కౌలు రైతులకు 1687 మందికి 0.47 కోట్లు వెరసి మొత్తం 180763 మంది రైతులకు రూ. 36.29 కోట్లు, అలాగే డా. వై ఎస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం రబీ -2021 కు సంబంధించి 12166 మంది లబ్దిదారులకు రూ. 2.44 కోట్లు మరియు ఖరీఫ్ -2022 నకు సంబంధించి 6084 మంది లబ్ధిదారులకు రూ. 1.49 కోట్లు వెరసి మొత్తం 18,250 మంది లబ్ధిదారులకు 3.93 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ నగదు లబ్ది చేకూరింది అని తెలిపారు.
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంయుక్త కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి రైతు భరోసా పిఎం కిసాన్ రూ. 36.29 కోట్ల మెగా చెక్కును మరియు డా. వై ఎస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద రూ. 3.93 కోట్ల రూపాయల మెగా చెక్కును రైతులకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ రామి రెడ్డి, జిల్లా సెరికల్చర్ అధికారిని గీతారాణి, వ్యసాయ సలహా మండలి సభ్యులు, రైతు సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.