Breaking News

ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం

పిచ్చాటూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం నందు జిల్లా పరిషత్ హై స్కూల్ లో లీడ్ బ్యాంకు మేనేజర్ ఆర్ సుభాష్  ఆధ్వర్యంలో మరియు హెడ్మాస్టర్ గిరి ప్రకాష్ అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం పై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో విద్యార్థులు చాలా ఆసక్తి కనపరిచి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది విద్యార్థులకు ముఖ్యంగా చిన్నతనము నుండే వారి విద్యాభ్యాసంలో భాగంగా మంచి పొదుపు అలవాట్లు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పైన అవగాహన మరియు సైబర్ నేరాలపై అంతర్జాలం నందు ఆర్థిక నేరాల బారిన పడి మోసపోకుండా ఏ విధంగా మెలకువలు పాటించాలని విషయం ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్సు మరియు ఇతర అధ్యాపకులు పాల్గొనడం జరిగింది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *