వై ఎస్ ఆర్ సున్న వడ్డీ రాయితీ గా 30,714 మంది రైతుల ఖాతాలకు రూ.5 కోట్ల 86 లక్షలు జమ

-3 వ విడత పీఎం కిసాన్ – రైతు భరోసా 3 వ విడత గా జిల్లాలో 1,41,216 మంది రైతులకు రూ.28 కోట్ల 39 లక్షలు
-కలెక్టర్ మాధవీలత
-జేసి తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని నమ్మి, ఆమేరకు జిల్లాలో పి ఎమ్ కిసాన్ – వై ఎస్ ఆర్ రైతు భరోసా కింద ఆర్ధిక చేయూత అంటించడం తో పాటు 5 వ విడత లో తూర్పు గోదావరీ జిల్లాలో 30,714 మంది రైతుల ఖాతాలకు రూ.5,85,69,974 లను వై ఎస్ ఆర్ సున్న వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నదని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

బుధవారం వై ఎస్ ఆర్ రైతు భరోసా – పి ఎం కిసాన్” పథకం మరియు వడ్డీ రాయితీ “వై ఎస్ ఆర్ సున్న వడ్డి పంట రుణాలు” పథకం కింద తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఆర్థిక సహాయం వర్చువల్ ద్వారా రైతు బ్యాంకు ఖాతాలకు జమ చెయ్యడం జరిగింది.

జిల్లా స్థాయి కార్యక్రమం లో బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రైతులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకి సున్న వడ్డీ రాయితీ, రైతు భరోసా చెక్కులను అందచేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరీ జిల్లా కు చెందిన రైతాంగానికి ఆర్ధిక సహాయం కింద పంట సహాయం అందించడంతో పాటు, వారు తీసుకున్న బ్యాంకు రుణం కోసం చెల్లించిన వడ్డీ రాయితీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2021-22  రబీ కి చెందిన  17,409 మంది రైతులకు రూ.3,40,08,955 లు, 2022 ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన  13,305 మంది రైతులకు రూ.2,45,61,019 లు వెరసి 30,714 మంది రైతుల ఖాతాలకు రూ.5,85,69,974 లను మేర సున్న వడ్డీ రాయితీ మేర ప్రయోజనం పొందినట్లు కలెక్టర్ తెలిపారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లడుతూ, రైతు లకు అన్నీ విధాల భరోసాగా నిలిచేలా పంట నష్టాలకు చెందిన ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో ఆ సీజన్ లోనే అందచెయ్యడం ద్వారా తదుపరి పంటకు పెట్టుబడి పెట్టడానికి ఆర్థికంగా చేయూత గా ఉపయోగ పడుతోందని అన్నారు.

నియోజక వర్గాల వారీగా రబీ, ఖరీఫ్ సీజన్లో జమ చేస్తున్న వై ఎస్ ఆర్ సున్న వడ్డీ రాయితీ..

అనపర్తి  – 4431 మంది రైతులకు రూ.74,22,319 ;

రాజమండ్రీ రూరల్ –  858 మంది రైతులకి రూ.14,07,455 ;

రాజమండ్రీ అర్బన్  1 రైతుకి రూ.2,975 ;

రాజానగరం – 6,341 మంది రైతులకు రూ.1,15,75,279 ;

గోపాలపురం – 4535 మంది రైతులకు రూ.1,08,04,814 ;

జగ్గంపేట – గోకవరం 921 మంది రైతులకు రూ.15,88,070 ;

కొవ్వూరు – 6462 మంది రైతులకు రూ.1,35,36,801 ;

నిడదవోలు – 7145 మంది రైతులకు రూ.1,21,82,261 ;

రైతుల, అధికారుల అభిప్రాయాలు:

రాజమండ్రి రూరల్ హుకుంపేట కి చెందిన
కురుమళ్ళ ఆంజనేయులు తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత గిట్టు బాటు ధరతో పాటు, రైతు భరోసా కింద ప్రోత్సాహకం గా ముందుగా నగదు అందించడం వల్ల రైతులకి ఎంతో మేలు చేకూరుతోందని అన్నారు. ఈ ఏడాది మూడు విడతలుగా రూ.13500 ఇవ్వడం జరిగిందని, వైయస్సార్ నున్న పంట రుణాల కింద ప్రయోజనం కలిగినట్లు తెలిపారు. రైతు సంక్షేమం తోపాటు ప్రజా సంక్షేమం కోసమే అమ్మఒడి, విద్యా దీవెన, నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగనన్న కు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు

రాజమండ్రి రూరల్ తొర్రేడు గ్రామంకు చెందిన కొత్తపల్లి కేశవరామారావు తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా నేరుగా నగదు బదలీ పధకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.13500 లు పి ఎం కిసాన్ – రైతు భరోసా కింద జమ చెయ్యడం జరిగిందన్నారు. రైతులు తీసుకున్న గత ఖరీఫ్, రబీ సీజన్లో పంట రుణాలకు చెందిన వైయస్సార్ సున్న వడ్డీ రాయితీ కీ కూడా ప్రభుత్వము జమ చెయ్యడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మా రైతులందరీ తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు మాట్లడుతూ, జిల్లాలో వైయస్ఆర్ పంట రుణాల సున్న వడ్డీ రాయితీ కింద రైతుల బ్యాంకు ఖాతాలకు రు. 5 కోట్ల 86 లక్షలు జమ చెయ్యడం జరిగిందని అన్నారు. అదే విధంగా పీఎం కిసాన్ – రైతు భరోసా 3 వ విడత గా జిల్లాలో 1,41,216 మంది రైతులకు రూ.28 కోట్ల 39 లక్షలు మూడో విడతగా రైతులకి జమ చెయ్యడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *