Breaking News

రైతుల భూవివాదాల పరిష్కారo దిశగా ఏ పి ల్యాండ్ టైట్లింగ్ చట్టం -2023 : కమిషనర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సిద్ధార్థ జైన్

-రైతుల కు భూమిపై వివాదరహిత యాజమాన్య హక్కు కల్పించడమే ఎ పి ల్యాండ్ టైట్లింగ్ చట్టం -2023 : ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లాం
-రైతుల భూసమస్యల పరిష్కార దిశగా రీ సర్వే ప్రక్రియ : జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూవివాదాల పరిష్కార దిశగా ఏ పి ల్యాండ్ టైట్లింగ్ చట్టం -2023 ను తీసుకొని రావడం జరింగిందని కమిషనర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సిద్ధార్థ జైన్ తెలిపారు.

శుక్రవారం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని సావేరి అతిథి గృహంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అజయ్ కలామ్ గౌ. ముఖ్యమంత్రి సలహాదారు, సిద్ధార్థ జైన్ కమిషనర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కలిసి రైతులు, రెవెన్యూ అధికారులు, అడ్వకేట్స్ , పోలీసు శాఖ వారి కి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం -2023 పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా కమిషనర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వo రైతుల భూవివాదాల పరిష్కార దిశగా. ఎ పి ల్యాండ్ టైట్లింగ్ చట్టం -2023 ను తీసుకురావడం జరింగింది అని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ చట్టం ద్వారా భూ యాజమాన్య వివాదాలు పరిష్కరించి భూ హక్కులపై రైతులకు పూర్తి భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలు, మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో వివాదాలకు అవకాశం లేకుండా చేయడమే లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించే దిశగా మొట్టమొదటి కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. బ్రిటిష్ వారి కాలంలో భూ రికార్డులో సక్రమంగా నిర్వహించకపోవడం ఆ రికార్డులను ఆధునికరించడంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి అని తెలిపారు. ఈ కారణం చేత భూ యాజమానులు భూమి మీద సంపూర్ణ హక్కులు భూ కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. ఈ చట్టం వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. స్వాతంత్రం అనంతరం భూ సంస్కరణలో భాగంగా ఎస్టేట్, ఇనాం వ్యవస్థ ద్వారా రైతులకు భూపత్రాలు ఇవ్వడం జరిగిందని, తదనంతరం 1989 సంవత్సరంలో ROR act ద్వారా పాస్ బుక్ మరియు టైటిల్ డీడ్ ఇచ్చి రైతులకు హక్కు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము రీ సర్వేలో భాగంగా ఎయిర్ క్రాఫ్ట్స్, రోవర్ వంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రతి భూ సరిహద్దును జియో రిఫరెన్స్ చేసి రైతులకు భూ హక్కు పత్రంలను జారీ చేసే విధానాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. కావున ఈ చట్టం ద్వారా భూమిపై కచ్చితమైన టైటిలింగ్ వలన భూ యాజమాన్యానికి భద్రత పెరుగుతుందన్నారు. మొత్తం టైటిల్ రికార్డు లుసురక్షితమైన ఆన్లైన్ సిస్టం లో నిల్వ చేయబడి మొబైల్ ఫోన్లు లో రైతుల భూ సరిహద్దును చూసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు.

ముఖ్యమంత్రి సలహాదారు మాట్లాడుతూ.. పాత భూ రికార్డులకు స్వస్తి పలికి రైతుకు శ్వాశత హక్కులు కల్పించే దిశగా .. ఎ పి ల్యాండ్ టైట్లింగ్ చట్టం -2023 ను అమల్లోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. రైతులకు భూ వివాదాలను పూర్తిగా పరిష్కరించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం లో ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆధునిక టెక్నాలజీతో రికార్డులు తారుమారు కాకుండా చూడవచ్చు అని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కార దిశగా రీసర్వే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎ పి ల్యాండ్ టైట్లింగ్ చట్టం -2023 ను తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. రైతులకు భూ వివాదాల నుంచి పరిష్కారం కోసం చూపాలనే ఉద్దేశంతో ఈ చట్టం వచ్చిందన్నారు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, ముఖ్యమంత్రి సలహాదారు, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రైతుల శాశ్వత భూ సమస్యల పరిష్కార నిమిత్తం ఎ పి ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుల భూ వివాదాలకు సంబందించిన అడిగిన సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వ౦ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చూపేలా కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పెంచల్ కిషోర్,తిరుపతి ఆర్ డి ఓ నిశాంత్ రెడ్డి, ఎ డి సర్వేయర్ అధికారి జయరాజ్, తాసిల్దారులు, డిప్యూటీ తాసిల్దారులు, వీఆర్వోలు , విలేజ్ సర్వేయర్లు, రైతులు, బ్యాంకింగ్ అధికారులు, పొలిసు శాఖాదికరులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు (మార్చి 13) అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల

– జిల్లాలో అన్న‌దాతల ఖాతాల్లో రూ. 67.69 కోట్లు జ‌మ‌ – ప‌థ‌కం నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *