Breaking News

స్త్రీలు అన్ని రంగాలలో వున్నతిని సాధించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్) కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను మహిళా సాధికార విభాగము మరియు ఉమెన్ జేఏసీ వింగ్ ఈస్ట్ గోదావరి వారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్. కే. మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాలలో వున్నతిని సాధించాలని ఆకాంక్షించారు. సుధా మూర్తి  లాంటి ఎంతోమంది స్ఫూర్తిదాయక మహిళల ఘనతను గురించి మాట్లాడారు.అంతేకాకుండా కళాశాల చరిత్రలో మొదటిసారి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి, ఫస్ట్ ఎం.కామ్. చదువుతున్న బి. ప్రవళిక అనే విద్యార్థినిని , విద్యార్థి దశలోనే వ్యాపారవేత్తగా జ్యూట్ బ్యాగ్ స్టార్ట్ అప్ ను నిర్వహించినందుకు గాను అభినందిస్తూ ఆమెను మహిళా దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్  స్థానంలో కూర్చోపెట్టి సన్మానించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్  శ్రీశైల శాస్త్రి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీలు చేసే సేవ కుటుంబానికి, సమాజానికి ఎంతో విలువైనదని, ఆ స్త్రీ గొప్పతనాన్ని మనమందరం గుర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ తాసిల్దార్, ఉమెన్ జేఏసీవింగ్ చైర్మన్ (తూర్పుగోదావరి జిల్లా )ఎం.ఎన్.ఎల్ వందన  మాట్లాడుతూ మహిళలు తాము పని చేసే దగ్గర పనిని ఒత్తిడిగా భావించక ఒక సవాలుగా స్వీకరించి చేయాలని అప్పుడు వారు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సందేశం ఇచ్చారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్  సోనీ  మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అప్పుడు మాత్రమే తమ బాధ్యతలను నిర్వర్తించగలరని, కుటుంబ బాధ్యత స్త్రీ పై వుంటుంది కాబట్టి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలో మహిళ అధ్యాపకులకు మరియు విద్యార్థినులకు అనేక పోటీలను నిర్వహించి, బహుమతులను అందించారు. కళాశాల మహిళా సాధికార విభాగం కోఆర్డినేటర్ విజయశాంతి మరియు సభ్యులు మరియు ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *