-ప్రభుత్వం అమలు చేస్తున్న పలు రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ మరియు అనుబంధ శాఖలపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సమీక్షించి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు ఉద్యాన శాఖ, ఏపీఎంఐపి, సెరికల్చర్, ఫిషరీస్, మార్కెటింగ్ శాఖలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఎన్నో అంశాల్లో వినూత్నమైన విభిన్న అవకాశాలు ఉన్నాయని వాటిని గుర్తించి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రైతులకు తగినంత ఫెర్టిలైజర్ ఆర్బికే లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఈ క్రాప్ ఈ కేవైసి లో మన జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని అధికారులు వివరించగా అలాగే ముందంజలో ఉండేలా కొనసాగించాలని సూచించారు. సిహెచ్సి లు రైతులకు అందుబాటులో ఉంచి సరసమైన అద్దెతో అందుబాటులో ఉండి ఉపయోగకరంగా ఉండాలని అన్నారు. వివిధ రైతులకు చెందిన పథకాలు వారికి తెలిసేలా అవగాహన కల్పించాలని కోరారు. సంతృప్తికరమైన సేవలు పొందిన లబ్ధిదారులు వారే బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉపయోగ పడతారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. తిరుపతి జిల్లాలో ఉద్యాన వన శాఖ ద్వారా ఆర్గానిక్, హెర్బల్ మొక్కలను ప్రమోట్ చేసి మంచి ప్రొడక్ట్ లు ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని సూచించారు. పక్క రాష్ట్రాలైన కేరళకు ఒకసారి ఎక్స్పోజర్ విజిట్ కు అధికారులను పంపడం జరుగుతుందని బెస్ట్ ప్రాక్టీసెస్ ను చూసుకుని వాటిలో మన జిల్లాకు ఉపయోగకరంగా ఉండే అంశాలపై దృష్టి సారించి మన జిల్లా ప్రత్యేకతను చాటి చెప్పాలని అన్నారు. ఏపీఎంఐపి ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి వచ్చేలా రైతులకు స్ప్రింక్లర్లు కంపెనీ ప్రతినిధుల ద్వారా అందచేసే పరికరాలు, పైపులు నాణ్యతగా ఉండాలని, అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఉద్యానవన పంటలపై రైతులను మోటివేట్ చేయాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ ద్వారా మొబైల్ వెటర్నరీ యూనిట్ ల ద్వారా అందచేస్తున్న సేవలు పక్కాగా ఉండాలని అన్నారు. మత్స్య శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తెలిసేలా వారికి చెప్పాలని తెలిపారు. ఫిష్ ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రమోట్ చేయాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ వారు రైతు బజార్ లను మరిన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. కిసాన్ మేళా లాంటి కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు, జిల్లా ఏపీఎంఐపీ అధికారి సతీష్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, జిల్లా సిరికల్చర్ అధికారిణి గీతారాణి, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.