తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సార్వత్రిక ఎన్నికలు- 2024 విధులకు కేటాయించబడిన నోడల్ అధికారులకు ఎన్నికలలో నిర్వహించవలసిన విధులపై వారి సన్నద్ధత కొరకు కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు -2024 నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై ఒక పక్కా ప్రణాళికతో అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇందుకొరకు వారికి కేటాయించిన సంబంధిత అంశంపై పీపీటి తయారీతో ఏర్పాట్ల సన్నద్ధతగా ఉండాలని ఆదేశించారు. స్వీప్ కార్యక్రమాల రూప కల్పనతో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా మోటివేషన్ కలిగించాలని సూచించారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఏర్పాటు చైతన్యవంతంగా ఉంటూ అర్హత కలిగిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా, ఓటు వేసేలా మోటివేషన్, క్యాంపస్ అంబాసిడర్ ల ఏర్పాటు ఉండాలని సూచించారు. రోజు వారీగా స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఉండాలని తెలిపారు.
ఎన్నికల విధులకు కావలసిన సిబ్బందిని కేటాయింపు మ్యాన్ పవర్, ట్రైనింగ్, మెటీరియల్, ట్రాన్స్ పోర్ట్, సైబర్ సెక్యూరిటీ, స్వీప్, లా అండ్ ఆర్డర్, ఈవిఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్ష్పెండిచర్, బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్టోరల్ రోల్స్, ఓటరు హెల్ప్ లైన్, అబ్జర్వర్స్ తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పెంచల కిషోర్, ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ ఆఫీసర్లు, ఎలక్షన్ సూపెరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News