గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సెక్ట్రోరల్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గాదర్శాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. సాదారణ ఎన్నికల విధులపై సెక్ట్రోరల్, రూట్ అధికారులకు అదనపు కమిషనర్ పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీతో కలిసి మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 22 మంది సెక్ట్రోరల్, 22 మంది రూట్ అధికారులకు విధులు కేటాయించామన్నారు. ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వస్తుందని, సెక్ట్రోరల్ అధికారులు ముందుగా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను రూట్ మ్యాప్ ప్రకారం పరిశీలించాలన్నారు. సెక్ట్రోరల్ అధికారులు ముందుగా ఎన్నికల సంఘం నిబందనలు, మార్గాదర్శకాలతో కూడిన హ్యాండ్ బుక్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ వచ్చిన అనంతరం జిఎంసిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. సెక్ట్రోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లినప్పుడు స్థానిక బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు రూపొందించిన చెక్ లిస్టు మేరకు పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు, వికలాంగులకు, వీలుగా ర్యాంపులు, విద్యుత్, త్రాగునీటి సరఫరా, మరుగు దొడ్లు వంటి కనీస వసతులపై దృష్టి సారించాలన్నారు. కేంద్రాల్లో పిఎస్ పేరు, బిఎల్ఓ పేరు, ఫోన్ నంబర్ లు పెయింట్ చేయించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఒకే కేంద్రంలో ఉండే స్టేషన్లకు పార్టీషన్ ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు గుర్తిస్తే ప్రత్యేకంగా సెక్ట్రోరల్ అధికారులతో ఏర్పాటు చేసిన వాట్స్ అప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఈఆర్ఓలు ప్రదీప్ కుమార్, సునీల్, ఎస్.ఈ. సుందర్రామిరెడ్డి, మేనేజర్ శివన్నారాయణ, ఆయా విభాగాల సూపరిండెంట్లు, సెక్ట్రోరల్, పోలీస్ అధికారులు, రూట్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …