గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా, ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ ప్రదాన పైప్ లైన్ లీకు మరమత్తు పనులను ఈ నెల 14 న ఇంజినీరింగ్ అధికారులు చేపట్టనున్నారని, మరమత్తు పనుల వలన నగరంలోని పలు ప్రాంతాల్లో గురు,శుక్రవారాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ కి రా వాటర్ సప్లై చేసే 1000 ఎంఎం డయా పిఎస్సి పైప్ లైన్ పై ఏర్పడిన లీకు వలన నీరు వృధా అవుతుందని, లీకు పనులను వెంటనే చేపట్టకుంటే త్రాగునీరు వృధా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. లీకు మరమత్తు పనులను గురువారం చేపట్టడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని, పనుల కోసం హెడ్ వాటర్ వర్క్స్ ని పూర్తిగా నిలుపుదల చేయాల్సి ఉంటుందన్నారు. పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనుల వలన గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు నగరంలోని నెహ్రు నగర్, శారదా కాలనీ, వసంతరాయ పురం, హెచ్.ఎల్.ఆర్., ఐపిడి కాలని, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, విద్యా నగర్, హనుమయ్య నగర్, నల్ల చెరువు, శ్రీనివాసరావు తోట, తారకరామ నగర్, ఏటి అగ్రహారం, బి.ఆర్.స్టేడియం, ఎల్.బి.నగర్, గోరంట్ల, అడవి తక్కెళ్లపాడు, రాజీవ్ గాంధీ నగర్, కోర్ట్ కాంపౌండ్, మిర్చి యార్డ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కె.వి.పి.కాలని, శ్యామలా నగర్, రెడ్డిపాలెం రిజర్వాయర్ల ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు పూర్తిగా త్రాగునీటి సరఫరా నిలిపివేయబడుతుందని, శుక్రవారం (15వ తేదీ) సాయంత్రం నుండి త్రాగునీటి సరఫరా యధావిదిగా జరుగుతుందని, నగర ప్రజలు సదరు అంశాన్ని గమనించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News