Breaking News

మొల్ల‌మాంబ తెలుగు సాహిత్య విలువ‌లు విశిష్టమైనవి

– ఆమె జీవితం అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కం: జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు క‌వ‌యిత్రి ఆతుకూరి మొల్ల‌మాంబ (మొల్ల‌) తెలుగు సాహిత్యానికి చేసిన సేవ‌లు, సాహిత్య విలువలు చాలా విశిష్టమైనవని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా బుధవారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు పాల్గొని ఆమె చిత్ర‌పటానికి పూల మాల‌లు అలంక‌రించి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు సాహిత్య రంగానికి మొల్ల‌మాంబ చేసిన సేవ‌లు, తేట తెలుగు ప‌ద్య కావ్యం మొల్ల రామాయ‌ణం, ఆమె వ‌ర్ణ‌నా మాధుర్యం త‌దిత‌రాల‌ను స్మ‌రించుకున్నారు. చిన్న చిన్న ప‌దాల‌తో గొప్ప అర్థం వ‌చ్చేలా ర‌చ‌న చేసిన ఆమె సాహిత్య ఔన్న‌త్యం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వం మొల్ల‌మాంబ జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో కేఆర్‌సీ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌, ఇన్‌ఛార్జ్ బీసీ సంక్షేమ అధికారి కిర‌ణ్మ‌యి, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *