-రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షిక నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాలయం నుండి బుధవారం పెండింగ్ ఫామ్ ల పురోగతి, తొలగింపులు, ఎపిక్ కార్డుల ముద్రణ మరియు పంపిణీ స్థితి, శిక్షణా కార్యక్రమాలు, ఫిర్యాదులు & ప్రతికూల వార్తలు, డిఈఎంపి, జిల్లా కంట్రోల్ రూమ్/సోషల్ మీడియా సెల్ ఏర్పాటు, ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ/ నివేదిక నిర్వహణ వ్యవస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల నుండి జిల్లా నోడల్ అధికారుల నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పలు నివేదికలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసి మాట్లాడుతూ జిల్లాల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా, రీ పోల్ కు అవకాశం లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీ శ గారు, ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ సంబంధిత ఈఆర్ఓ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిఈఓ మాట్లాడుతూ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ బియాండ్ ఎస్ఎల్ఎ కు వెళ్లకుండా త్వరితగతిన నిబంధనల మేరకు పూర్తి చేయాలని అన్నారు. తిరుపతి జిల్లాలో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పెండింగ్ అంశాల క్లియరెన్స్ నందు మంచి పురోగతి ఉందని తెలుపగా, కలెక్టర్ వివరిస్తూ రోజు వారీగా సమీక్షించుకుని క్లియర్ చేస్తున్నామని తెలిపారు.
సిఈఓ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తేదీ నుండి ఎంసిఎంసి ప్రతిరోజూ వార్తా పత్రికలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మొబైల్ నెట్‌వర్క్, సోషల్ మీడియా మొదలైన వాటి నుండి చెల్లింపు వార్తలు మరియు రాజకీయ ప్రకటనలపై నివేదికను ప్రతి అభ్యర్థికి సంబంధించి ఒక ఫార్మాట్‌లో ఆర్.ఓ మరియు వ్యయ పరిశీలకునికి కాపీతో అకౌంటింగ్ బృందానికి సమర్పించాల్సి ఉంటుందని, షెడ్యూల్ ప్రకటన తేదీ నుండి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు నోటిఫికేషన్ తేదీ నుండి స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు పని చేయాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనం GPS ఏర్పాటు ఉంటుందని, సరిహద్దు చెక్‌పోస్టులకు ఎస్‌ఎస్‌టీ ఏర్పాటు,సరిహద్దు చెక్ పోస్ట్‌లతో సహా అన్ని SSTలు వెబ్‌కాస్టింగ్ సదుపాయం ఉండాలని అన్నారు. ఎంపీడీఓల నేతృత్వంలో ఎంసీసీ బృందాలు యాక్టివ్‌గా పని చేయాలని, వీడియోగ్రాఫర్ ఉండాలని, సూచించిన ఫార్మాట్‌లో MCC ఉల్లంఘనలపై ప్రతిరోజూ ఆర్.ఓ కి నివేదించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై దిశా నిర్దేశం చేశారు. నగదు లక్ష రూపాయల పైన డ్రా చేసిన, పలువురికి ఒకే అకౌంట్ నుండి లక్ష పైన పంపిన వాటి మానిటరింగ్ ఉంటుందని తెలిపారు. లిక్కర్ స్టాక్ బల్క్ గా నిల్వలు ఉండరాదని, స్టాక్ పర్యవేక్షణ ఉండాలని అన్నారు. వెబ్కాస్టింగ్ ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ సమన్వయము చేయాలని తెలిపారు. మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అధికారులు వి.సి లో పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్ సిఈఓ గారికి వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షిక నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఈఆర్ఓ అదితి సింగ్, అదనపు ఎస్పీ వెంకట్రావు, డిఆర్ఓ పెంచల కిషోర్, ఈఆర్ఓ లు కిరణ్ కుమార్,రవి శంకర్ రెడ్డి, చంద్రముని, రామ్మోహన్, కలెక్టరేట్ ఎన్నికల తాసిల్డార్ చంద్ర శేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.