-వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ చేసిన తిరుపతి మునిసిపల్ కమిషనర్ అదితి సింగ్
-కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి: తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెనుకబడిన వర్గాలలోని వారికి ఎస్సీ, సఫాయి కరంచారి తదితర వర్గాల వారి అభ్యున్నతి కొరకు రుణసహాయాన్ని మంజూరు చేయడానికి దేశవ్యాప్త ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్‌గార్ ఆధారిత్ జనకళ్యాణ్ (PM-SURAJ) పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ విధానంలో లబ్ధిదారులను, ప్రజలను ఉద్దేశించి తెలుపగా, ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు లబ్ధిదారులు, అధికారులతో కలిసి వీక్షించే ఏర్పాటు చేయగా తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, డి ఆర్ ఓ పెంచల కిషోర్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (NAMASTE) కింద సఫాయి మిత్రులకు (మురుగు మరియు సెప్టిక్ ట్యాంక్ కార్మికులు) ఆయుష్మాన్ హెల్త్ కార్డులు మరియు పీపీఈ కిట్‌లు పంపిణీ లో భాగంగా సుమారు 500 జిల్లాల నుండి వెనుకబడిన వర్గాలకు చెందిన 3 లక్షల మందికి పైగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడుతూ… దేశంలోని బలహీన వర్గాలకు చెందిన ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తలకు క్రెడిట్ సపోర్టు మంజూరు కొరకు పి ఎం-సూరజ్ జాతీయ పోర్టల్ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ముద్ర రుణాలు,స్టాండప్ ఇండియా పథకాల ద్వారా యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కి ఎదిగారని తెలిపారు. అట్టడుగు, బలహీన వర్గాలకు విద్యా,ఆర్థిక, సామాజిక సదుపాయాల కల్పన మరియు పునరావాసం కల్పించడానికి సూరజ్ పోర్టల్ ను ప్రారంభించారని, ఈ పోర్టల్ ద్వారా రుణాలను సులువుగా పొందేందుకు అవకాశం ఉంటుందనన్నారు.
ఇందులో మన తిరుపతి జిల్లాలో ఎన్బిసిఎఫ్ఎల్ ఒకరు, లీడ్ బ్యాంక్ నుండి 35 మంది ఎన్ఈఎఫ్డిసి నుండి 115, ఎన్ ఎస్కేఎఫ్డీసి 55 మంది, స్త్రీ నిధి 57 మంది, NAMASTE నుండి 69 మంది వెరసి మొత్తం 168 మంది లబ్ధిదారులు, ఆయుస్మాన్ భారత్ కార్డులు పొందిన వారు 11 మంది, పీపీ ఈ కిట్లు 6 మంది, బ్యాంకు లోన్లు 25 మందికి, స్త్రీ నిధి లబ్ధిదారులు 57 మందికి అసెట్స్ పంపిణీ పత్రాలు నేడు అందజేయడం జరిగిందనీ మునిసిపల్ కమిషనర్ తెలిపారు. లబ్ధిదారులు సుమారు 390 మంది పాల్గొన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక సంచాలకులు యస్.సి. కార్పోరేషన్ డాII యు. నరసింహులు, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ అన్వేష్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బి సి సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్, పి డి డి ఆర్ డి ఎ జ్యోతి, పి డి మెప్మా రాధమ్మ మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News