Breaking News

ఆర్టీసీ హౌస్ లో కవయిత్రి మొల్లకు ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ లో బుధ‌వారం  కవియిత్రి మొల్ల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఎం.డి.  సిహెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్, ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సంస్థ ఎం.డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు మహా కవియిత్రి మొల్ల జయంతి నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. 16 వ శతాబ్ధంలో కవియిత్రి మొల్ల రామాయణాన్ని తెలుగు భాషలో అందరికీ అర్ధమయ్యే రీతిలో సరళంగా, రమణీయంగా రచించడం గొప్ప విషయమని ఆమె గొప్పతనాన్ని, జీవిత చరిత్రని కొనియాడారు. ఆ కాలంలో ఎక్కువగా కవులు ఉండేవారని కానీ కవియిత్రిగా మొల్ల తన ప్రావీణ్యంతో రామాయణాన్ని తనదైన శైలిలో రచించి శ్రీ కృష్ణ దేవరాయులను సైతం మెప్పించగలిగారన్నారు. ఆమె మన రాష్ట్రంలో జన్మించడం మనకు గర్వకారణమని, ఆరు కాండాలుగా రామాయణాన్ని ఎంతో చక్కగా రచించారని, ప్రతి కాండం యొక్క గొప్పతనాన్ని సరళంగా విపులీకరించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గొప్ప రచయిత్రిని స్మరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
కవియిత్రి మొల్ల యొక్క పరిచయ కార్యక్రమాన్ని డిప్యూటీ సి. పి. ఎం. (హెచ్. ఆర్. డి.) సాంబ్రాజ్యం నిర్వహించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డిఅధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఓ)  కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈ) రవి వర్మ, ఎఫ్.ఏ & సి.ఏ.ఓ.  రాఘవ రెడ్డి, విజిలెన్స్ (ఏ.డి.) శోభామంజరి, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఆర్టీసీ హౌస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *