అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అతను నిజ జీవితంలోనూ రియల్ స్టార్! అతను చాలా మందికి అర్ధం కాడు! అందరిలెక్క అతనికి నిజ జీవితంలో, అందునా రాజకీయ రంగంలో నటించడం రాదు! సహజంగానే సిగ్గరి! కెమెరా ముందు కూడా చాలా సార్లు సిగ్గుతో మొహమాటపడి కొంత గ్యాప్ తీసుకుని షూట్ స్టార్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి! అతనంతే భ్రమల్లో ఉండడు! వాస్తవంలో జీవిస్తాడు, జీవిస్తుంటాడు! అందుకే అంత ఈజీగా అర్ధం కాడు!
ఎక్కడ హెచ్చాలో, ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వాడు! భేషజాలు వుండవు! ఆర్భాటాలు నచ్చవు! సింపుల్ గా జీవించేస్తుంటాడు! అందుకే అతను మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది! మనసులు కలవనప్పుడు దూరంగా ఉండటమే బెటర్ అనుకునే మనస్తత్వం! అతని గురించి తెలియనివాళ్ళు మూడు పెళ్లిళ్లు అంటూ వెటకారం చేస్తారు, రాజకీయ అస్త్రంగా వాడుకుంటారు! కానీ, విడాకులు తీసుకున్న మాజీ భార్యలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ని ఒక్కమాట కూడా అనడం మనం ఎక్కడా విని ఉండం! అతన్ని అర్ధం చేసుకోలేనప్పుడు విడివిడిగా ఉండటమే బెస్ట్ అని వారికి ఆర్ధిక హార్దిక చేయూతను ఇచ్చి విడిపోయాడే తప్ప ఎప్పుడూ వారి గురించి ఒక్కమాట కూడా మాట్లాడింది మనం వినలేదు! వారిని తక్కువ చేసింది లేదు!
మనం ఒడ్డున నిలబడి ఎన్ని అయినా చెబుతాం! అనుభవించే వాడికే ఆ బాధ తెలుస్తుంది! జనానికి అదేం పట్టదు! ఆ మాటకొస్తే అవసరం లేదు! అన్న మెగాస్టార్ ప్రజా రాజ్యం పెడితే అందరిలాగే ఆయన రాజకీయంలోకి వచ్చాడు! యువరాజ్యం పగ్గాలు చేపట్టాడు! అన్న పెట్టిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేస్తే, బాధ వున్నా తనకు జీవితాన్ని ఇచ్చిన అన్నను ఒక్కమాట అనలేదు! జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఎన్ని కష్టాలొచ్చినా ఎంత ఖర్చు అవుతున్నా పంటి కింద దాచుకుని పదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు! జనం మంచోళ్ళు, జనం అమాయకులు, జనం తెలివైనవాళ్ళు! నిజాన్ని నిదానంగా అర్ధం చేసుకుంటారు, తనను అర్ధం చేసుకోవడం అంత ఈజీ కాదు అనుకుంటూనే ముందుకు సాగుతున్నాడు! పైగా రొటీన్ రాజకీయాలకు అలవాటు పడిన వారికి ఆయన అసలు అర్ధం కాడు!
ప్యాకేజి స్టార్ అని అతనంటే గిట్టని వారు, అతనిపై కోపం వున్నవారు, దత్త పుత్రుడు అని అతని వల్ల నష్టపోతున్న వాళ్ళు వాళ్ళకిష్టం వచ్చిన టైటిల్ తో విమర్శిస్తూ ఉంటారు! ఆయన మౌనంగా బాధ పడుతుంటారు కానీ, పెద్దగా పట్టించుకోరు! మనసాక్షిని నమ్ముకోవడమే అతని బలం! మనం నిజాయితీగా వున్నాం, ఎవడేమనుకుంటే మనకేం, మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఆయన దూసుకెళుతూనే ఉంటాడు! కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూనే ఉంటాడు!
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం! కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం అతడే! టీడీపీతో బిజెపి చేతులు కలపడంలో అతని కృషి కూడా చాలా ఉంది! జన సైనికులు, అభిమానులు అంటున్నట్లుగా ఇంకో 20 సీట్లు అధికంగా అడగవచ్చు! చంద్రబాబు కూడా తప్పని స్థితిలో అంగీకరించే పరిస్థితి కూడా ఉంది! కానీ అతను జెంటిల్మెన్! అడగలేదు! తనేమిటో తన బలం ఏమిటో తనకు బాగా తెలుసు! కార్యకర్తలు అంతే! అభిమానం తో అలా మాట్లాడుతుంటారు! వాస్తవంలో మనం ఉండాలనేది, నిర్ణయాలు కూడా అదే దిశలో ఉండాలనేది అతని మాట! మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అతన్ని రెండు చోట్లా ఓడించారు! రాజోలు ఒక్క సీటు గెలిస్తే అతను వెళ్లి అధికార పార్టీలో చేరిపోయాడు! అప్పుడు కార్యకర్తలు, విశ్లేషకులు అతన్ని అవమానిస్తూ మాట్లాడారే కానీ, గెలుపులో సహకరించలేదు! ఎక్కువ సీట్లు తీసుకుని తక్కువ గెలిచే కన్నా, గెలిచే సీట్లు తీసుకుని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం అతని లక్ష్యం! అందుకే 24 సీట్లకే పరిమితం అయ్యాడు! తీరా బిజెపి తో కలిసి సీట్ల కేటాయింపులో తనకు తాను తగ్గించుకున్నాడు! తన పార్టీకి కేటాయించిన సీట్లలో మూడు సీట్లు బీజేపీకి ఇచ్చేశాడు! ఒక ఎంపి సీటు కూడా వారికే వదిలేసాడు! నిజానికి బిజెపి కన్నా జనసేన కే బలం ఎక్కువ! బిజెపి తీసుకున్న పది సీట్లు వారి ఓటింగ్ బలాన్ని చూస్తే చాలా ఎక్కువ! కాకపోతే వారి చేతిలో కేంద్ర అధికారం ఉంది! ఎన్నికల్లో ఇక్కడ అధికార పార్టీ చేసే అక్రమాలను అడ్డుకోవాలంటే కేంద్ర సహకారం అవసరం! ఎందుకంటే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి! ఎవ్వరిని ఏమీ అనలేం! ఆ సంగతి అతనికి బాగా తెలుసు! అధికారంలో వున్న పార్టీని దించడమే అతని ప్రధాన లక్ష్యం! అందుకే ఆయన త్యాగానికి సిద్ధమయ్యారు! పెద్ద మనసుతో ఒక్క అడుగు వెనక్కి వేశారు! అంత మాత్రాన ఆయన చరిష్మా తగ్గేదేం లేదు! తగ్గినా తాత్కాలికమే! భవిష్యత్ లో అతనొక చరిత్ర సృష్టిస్తాడు! చెప్పుకునే స్థాయి సంచలనాలు సృష్టిస్తాడు! చరిత్రలో ఖాయంగా నిలిచిపోతాడు! అన్న కన్నా బెటర్ గా! ఇది మాత్రం నిజం! నచ్చేశావ్ పవర్ స్టార్ నచ్చేశావ్!