-11వందల కోట్ల ప్రభుత్వ సంపదతో….గుడివాడలో పేదప్రజల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు
-గుడివాడలో 16వేల మందికి సీఎం జగన్ పూర్తి స్థాయి మౌలిక వసతులతో ఇల్లు ఇచ్చారు….
– ఇక్కడకు వచ్చి టీడీపీ వాళ్ళు పిట్ట కథలు చెబుతున్నారు….
– సీఎంగా వైఎస్సార్77ఎకరాలు….జగన్ 182ఎకరాలు గుడివాడ ప్రజల ఇళ్ల కోసం ఇచ్చారు….అభివృద్ధికి మరో 350కోట్లు ఇచ్చారు
-14ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఎకరా ఇచ్చినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా…..దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించాలి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం జగనన్న కాలనీలో రూ.4 కోట్ల 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన 33/11 విద్యుత్ ఉపకేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు,ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని విద్యుత్ కేంద్ర ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు విద్యుత్ అధికారులు పుష్పగుచ్చాలు అందచేసి గౌరవ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో 2019లో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారన్నారు. పథకంలో భాగంగా గుడివాడలో ఒక్కో ఎకరా 56 లక్షలు చొప్పున, 97 కోట్లతో 182 ఎకరాలు సేకరించినట్లు ఎమ్మెల్యే నాని తెలియజేశారు. 2020-21 సంవత్సరాల వేసవి సీజన్ 6 నెలల వ్యవధిలో 40 వేల లారీల మట్టితో స్వల్ప కాలంలోనే లేఅవుట్ మెరక చేసి 7వేలమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే నాని తెలియచేశారు. తొలి దశలోనే నాలుగు వేల ఇళ్లకు సాంక్షన్ ఇచ్చి, ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి లక్ష 80వెలు లబ్ధిదారులకు ఇచ్చామన్నారు. జగనన్న లే అవుట్ లో 4కోట్లు, టిడ్కో కాలనీలో 8కోట్లు మొత్తం 12కోట్లతో రెండు ప్రాంతాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించి లైన్లు వేసామన్నారు.వైఎస్సార్ సేకరించిన 77ఎకరాల భూమిలో దుర్మార్గుడు చంద్రబాబు , కేవలం 12వందల ఇల్లు 25శాతం పూర్తి చేసి లబ్ధిదారుల వద్ద 50వేల చొప్పున డబ్బు వసూలు చేసి అయిదేళ్లపాటు సొల్లు కబుర్లు చెబుతూ కాలం గడిపారని కొడాలి నాని అన్నారు.సీఎం జగన్ ప్రజలందరికీ నివాస యోగ్యంగా ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయడమే కాక 350కోట్లతో పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించి, ఇల్లు అప్పగించారని ఎమ్మెల్యే కొడాలి నాని తెలియచేశారు.మరో 7కోట్లతో జగనన్న కాలనీలో మిగిలిన కొద్ది పాటి అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం అవుతాయని కోడలి నాని తెలియ చేశారు.ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన సీఎం జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలిచి తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె పుష్పరాణి, మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ మట్టా నాగమణి ,పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను,వైసిపి నాయకులు పాలేటి చంటి,ఎంపీపీ పెయ్యాల ఆదాం, రెమల్లి లీలాకాంత్, గద్దే రాము,గుదే రవి, గంటా సురేష్, డాక్టర్ RK, మామిళ్ళ ఎలీషా, కర్రే నాని, గిరి బాబాయ్, పాలడుగు రాంప్రసాద్,విక్టర్ పాల్, విరిశెట్టి నరసింహారావు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.