గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంలు, వివి ప్యాట్ ల వినియోగంపై సెక్టోరల్ అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంలు, వివి ప్యాట్ ల వినియోగంపై కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పశ్శిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీ, మాస్టర్ ట్రైనర్ల ద్వారా సెక్టోరల్ అధికారులకు డెమో ఈవిఎంలు, వివి ప్యాట్ లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవిఎంలు, వివి ప్యాట్ లు పని చేసే విదానం పై సెక్టోరల్ అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలన్నారు. ఎన్నికల సరళిలో ఏ పోలింగ్ కేంద్రంలో సమస్య ఎదురైనా వెను వెంటనే సెక్టోరల్ అధికారులు పరిష్కారం చేసేలా ఈవిఎంల పనితీరు తెలుసుకోవాలన్నారు. ఈవిఎం, వివి ప్యాట్ కనెక్షన్, సీల్ అత్యంత ప్రదానమైన అంశాలన్నారు. మాస్టర్ ట్రైనీలు ఈవిఎంల పై ఏ సందేహం ఎదురైనా పరిష్కారం చేయడానికి సిద్దంగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనీలు ఈవిఎంలు, వివి ప్యాట్ ల పనితీరుపై వివరించి, సెక్టోరల్ అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
Tags guntur
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …