Breaking News

సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి క్యాష్ కౌంటర్లు… : కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 15రోజులు మాత్రమే ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా సెలవు రోజుల్లోనూ క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల పన్నులు పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితిని పొందాలని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి పన్ను పై వడ్డీ యధావిధిగా ఉంటుందన్నారు. పన్నుపై వడ్డీ రాయితీ పొందేందుకు 15 రోజులే గడువు ఉన్నందున సెలవు రోజుల్లో కూడా జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటుగా, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లోని క్యాష్ కౌంటర్లు యధావిదిగా పనిచేస్తాయన్నారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *