-జిల్లాలో ఎపీపిఎస్సి గ్రూప్ -1 పరీక్షలకు 25 కేంద్రాలు
-పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలి
-మొదటి పరీక్ష ఉదయం 10.00 నుంచి మ 12.00 వరకు
-రెండో పేపర్ మ.2 నుంచి సా.4 వరకు
-పరీక్షా కేంద్రాలలోనికి గంట ముందు నుంచి అనుమతించడం జరుగును
-పరీక్షా ప్రారంభానికి 15 నిముషాలు ముందు నుంచి అభ్యర్ధులను కేంద్రం లోకి అనుమతించడం జరుగదు
-జేసి తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలో మార్చి 17 వ తేదీ ఆదివారం 25 పరీక్షా కేంద్రాలలో ఏపిపిఏస్సి గ్రూప్ 1 పరీక్షలు అత్యంత పకడ్బందీ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎపీపి ఎస్సి నోడల్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అన్నారు. సోమవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ 1 పరిక్షల నిర్వహణ నేపథ్యంలో గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, మార్చి 17 వ తేదీ ఆదివారం తూర్పు గోదావరీ జిల్లా పరిధిలోని 25 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 1 ఎపిపిఎస్సి పరీక్షల నిర్వహణా కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రభుత్వ సర్వీసులల్లో గ్రూప్ వన్ పరీక్షలు అత్యంత ప్రాధా న్యత కలిగిన పరీక్షగా పేర్కొ న్నారు. పరీక్షలకు సంసిద్ధం అయిన అభ్యర్ధులు అధిక శాతం హజరు కానున్న ట్లు తెలిపారు. ఆయా కేంద్రాలలో హాజరయ్యే అభ్యర్థులకు అను గుణంగా ఏర్పాట్లు చేయాలన్నా రు. విద్యుత్, త్రాగునీటి, తది తర కనీస అవసరాలు, మెడిక ల్ క్యాంపులు అందుబాటులో ఉంచడం జరిగిందని స్పష్టం చేశారు.
ఉదయం పేపర్ 1 పరిక్ష ఉదయం 10.00 నుంచి మ.12.00 గంటల వరకు , మధ్యహ్నం పేపర్ 2 పరీక్ష మ.2.00 గంటల నుంచి సా.4.00 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలలోనికి ఆయా కేంద్రాల కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్లు , ఇన్విజిలేటర్లు , రూట్ ఆఫీసర్లు , లైజన్ ఆఫీసర్లు , పరిశీలకులు తగిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు భద్రపరిచెందుకి తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆర్టిసి, రవాణా శాఖ అధికా రులు ఆయా రూట్లలో బస్సు లు, ఆటోలని అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాల న్నారు. ప్రతీ కేంద్రం వద్ద మెడి కల్ క్యాంపు ఉంచాలన్నారు.
25 కాలేజీల్లో 25 జిల్లా స్థాయి అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చెయ్యాలని , పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒక్క పెన్ను తప్ప ఏమి తీసుకు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని కాలేజి యాజమాన్యాలను, అధికారులను, పోలీసులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహించడానికి 25 కాలేజీల్లో 353 రూములు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు , నిరంతర విద్యుత్ , ఇతర అనుబంధ ఏర్పాట్లు చేయాలన్నారు.
అభ్యర్థులకు సూచనలు:-
పేపర్ -1 పరీక్ష ఉదయం 10.00 నుండి మద్యాహ్నం 12.00 వరకు నిర్వహిస్తామని, అభ్యర్ధులను పరీక్షా కేంద్రములోనికి ఉదయం 9.00 నుండి 9.45 వరకు అభ్యరులను అనుమతించబడును.
ఉ.9.45 గంటల తరువాత పరీక్ష హాలు లోనికి అభ్యర్ధులను అనుమతించడం జరుగదు.
పేపర్ -2 పరీక్ష మ.2.00 నుండి 4.00 వరకు జరుగును. అభ్యర్థులను పరీక్షా కేంద్రములోనికి మ.1.00 నుండి 1.45 వరకు అభ్యరులను అనుమతించబడును. మ.1.45 గంటల తరువాత పరీక్ష హాలు లోనికి అభ్యర్ధులను అనుమతించడం జరుగదు .
అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటుగా ఒక ఒరిజినల్ ఫోటో I.D. (పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తకింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, etc) తో హాజరు కావలెను. హాల్ టికెట్ నందు ఫోటో లేక పోయినా, ఫోటో సరిగా లేని అభ్యర్ధులు గెజిటెడ్ అధికారి సంతకముతో 3 పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటో లతో హాజరు కావలెను
పరీక్షా కేంద్రము లోపలకు సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ లతో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరములు అనుమతించబడవు.
ఈ సమావేశంలోనే డి ఆర్వో జి. నరసింహులు, అదనపు ఎస్పీ పి. అనిల్ కుమార్ , ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సందు సాయి ప్రకాష్, సెక్షన్ ఆఫీసర్ పీ. దిల్లేశ్వరరావు , కాలేజి ప్రిన్సిపల్స్, ప్రతినిథులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News