Breaking News

వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-కలెక్టరేట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో పాల్గోన్న జేసి తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల హక్కులను కాపాడేందుకు జిల్లాలో పటిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. కలెక్టరేట్ డి ఎస్ వో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా “వినియోగదారుల కొరకు న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు” అంశంపై చర్చ వేదిక నిర్వహించారు.

ఈ సందర్బంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ, వినియోగదారుల్లో అవగాహాన కల్పించడం అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ప్రస్తుత తరుణంలో వినియోగదారులు న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు (AI) ను జాగరుకతతో వినియోగించుకోవాలన్నారు. వినియోగ దారులు మోసపోకుండా ఉండేందుకు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.  ప్రజల్లోకి వినియోగ దారులు హక్కులు, ప్రయోజనాలు పై విస్తృత స్థాయిలో ప్రచారము కలుగ చేసేందుకు కార్యచరణ సిద్దం చెయ్యాలని పేర్కొన్నారు.

కార్యక్రమములో జిల్లా పౌర సరఫరాల అధికారి పి. విజయ భాస్కర్, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రుక్కయ్య, అసిస్టెంట్ కంట్రోలర్ శామ్యూల్ రాజు, ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ శివ బాలాజీ, స్వామి నాధన్, హరిబాబు, స్టూడెంట్స్ కన్స్యూమర్ క్లబ్స్ మాస్టర్ ట్రైనీస్, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు, విజిలెన్స్ సభ్యులు, కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజర్స్, చౌక ధరల దుకాణ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *