-కొత్తగా 18 పోస్టులో భర్తీకీ ఉత్తర్వులు
-హోం మంత్రి తానేటి వనిత
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, గోపాలపురం నియోజకవర్గంలో రు.2 కోట్ల 74 లక్షలతో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం , 18 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు హోమ్ మంత్రి తానేటి వనీత శుక్రవారము రాత్రీ ఒక ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి లో ఫైర్ స్టేషను ఏర్పాటు, అనుబంధ సిబ్బంది ని మంజూరు చేయాలని కోరడం తో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి గోపాలపురం నియోజకవర్గం ప్రజల తరపున హోమ్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తాము పంపిన ప్రతిపాదనను నిశితంగా పరిశీలించిన రూ .2 కోట్ల 74 లక్షల 33 ల ను రికరింగ్ నాన్ రికరింగ్ డిపాజిట్లు కింద నిధులు మంజూరు చెయ్యడం జరిగిందన్నారు. ఫైర్ స్టేషను లో 18 పోస్టులను భర్తీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, స్టేషన్ ఫైర్ ఆఫీసర్-01, లీడింగ్ ఫైర్‌మెన్-03, ఫైర్‌మెన్-13 మరియు స్వీపర్‌లతో కూడిన కొత్త ఫైర్ స్టేషన్‌ను పశ్చిమ గోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు హోమ్ మంత్రి తెలియ చేశారు.