Breaking News

నేడే జాతీయ లోక్ అధాలత్

-పూర్వపు తూర్పు గోదావరి జిల్లాలోని 64 కోర్టు లలో నిర్వహణ
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

రాజమహేంద్రవరం (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు నేడే ది. 16.3.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. రాజమహేంద్రవరం , అమలాపురం , కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ప్రత్తిపాడు, ఆలమూరు, తుని , ముమ్మిడివరం, కొత్తపేట, అనపర్తి , రంపచోడవరం , అడ్డతీగల కోర్టుల యందు నేడే ది. 16.3.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలియ చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు, రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించ నున్నట్లు తెలిపారు. కావున కక్షిదారులందరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని జిల్లా వ్యాప్తంగా జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు నేడే ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను ఆయా కోర్టుల నందు పరిష్కరించు కొనవలసినదిగా ఆ ప్రకటనలో తెలియజేసి యున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *