-అభ్యర్థులు ఫోన్ నంబర్ 8977935609 కి ఉదయం 7 నుంచీ సా.5 వరకు సంప్రదించ వచ్చు
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహార్ రెడ్డి విజయవాడ నుంచీ ఎపిపిఎస్సీ, ఎలక్షన్స్, పంచాయతీ రాజ్, రీ సర్వే, వైద్య ఆరోగ్య, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జాయింట్ కలక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర అధికారులతో కలిసి కలక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత ఆయా అంశాలపై మాట్లాడుతూ, ఏపి పి ఎస్సి గ్రూప్-I పరీక్షలకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పరీక్షా కేంద్రాలలో సీ సి టివి పర్యవేక్షణ లో పరీక్షల నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలియ చేశారు. పరీక్షల నిర్వహణ పరిశీలించే, తనిఖీలు నిర్వహించే స్క్వాడ్స్ అధికారుల వాహనాలకు జిపిఏస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు.
ఎపిపి ఎస్సి గ్రూప్ -1 పరీక్షల కోసం హాజరయ్యే అభ్యర్థులు సౌకర్యార్ధం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందనీ కలెక్టర్ తెలిపారు. పరీక్షలకి హాజరయ్యే అభ్యర్థులు కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 8977935609 కి ఉదయం 7 నుంచీ సా.5 వరకు సంప్రదించ వచ్చు అని తెలియ చేశారు.
ఎమ్ సి సి మార్గదర్శకాలకి చెందిన సమగ్ర సమాచారం ఆయా జిల్లా ఎన్నికల అధికారులకి పంపడం జరిగిందనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియ చేశారు. ఎన్నికల కమిషన్ నియమావళి ఖచ్ఛితంగా సమయపాలన కార్యచరణ మేరకు పాటించి , అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆమేరకు చర్యలు తీసుకోనున్నట్లు కలక్టర్ మాధవీలత తెలిపారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 52 లక్షల పని దినాలకు గానూ సుమారు 48 లక్షలు పని దినాల లక్ష్యం సాధించడం జరిగిందనీ, పేర్కొన్నారు. 5514 మంది కుటుంబాలు 100 రోజుల పని దినాలు సాధించినట్లు, 81 నుంచీ 99 వరకు పనిదినాలు 14,918 కుటుంబాలకి కల్పించామన్నారు. మిగిలిన లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రాధాన్యతా భవనాలకు చెంది 373 గ్రామ సచివాలయ లకి గాను 344 నిర్మాణం పూర్తి చేసినట్లు, 347 అర్భిలకి గాను 299 భవనాలు, 258 వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ గానూ 214 భవనాలు పూర్తి చేశామని, మిగిలిన భవనాలు పురోగతి లో ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 52 లక్షల పని దినాలకు గానూ సుమారు 48 లక్షలు పని దినాల లక్ష్యం సాధించడం జరిగిందనీ, పేర్కొన్నారు. 5514 మంది కుటుంబాలు 100 రోజుల పని దినాలు సాధించినట్లు, 81 నుంచీ 99 వరకు పనిదినాలు 14,918 కుటుంబాలకి కల్పించామన్నారు. మిగిలిన లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రాధాన్యతా భవనాలకు చెంది 373 గ్రామ సచివాలయ లకి గాను 344 నిర్మాణం పూర్తి చేసినట్లు, 347 అర్భిలకి గాను 299 భవనాలు, 258 వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ గానూ 214 భవనాలు పూర్తి చేశామని, మిగిలినవి పురోగతి లో ఉన్నట్లు తెలిపారు.
జనన , మరణాలు నమోదు 100 శాతం చేసేలా నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో అవగాహాన కల్పించడం జరుగుతుందనీ మాధవీలత అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , డి ఆర్వో జి. నరసింహులు, జిల్లా అధికారులు డి. బాల శంకర రావు, ఎమ్ డి అలిముల్ల, ఏ. ముఖ లింగం, సునీల్ కుమార్, డా కే. సనత్ కుమారీ, డా కె. వేంకటేశ్వర రావు, డా పి. ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.