-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోర్టుల పరిధిలో 64 బెంచ్ లు నిర్వహణ
-ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు 1513 కేసులు పరిష్కారం రూ.2 కోట్ల 30 లక్షల మేర అవార్డ్ లు జారీ
– జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, ఆమేరకు అవార్డి ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, తదితరుల భాగస్వామ్యం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి గంధం సునీత అన్నారు.
శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డి ఎల్ ఎస్ ఎ అధ్యక్షురాలు జడ్జి గంధం సునీత మాట్లాడుతూ, సుప్రీం కోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనలు మేరకు రాజీ మార్గం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నాలుగు రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న 64 కోర్టుల యందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగు తోందని అన్నారు.
సుప్రీం కోర్టు వారి ఉత్తర్వులు, గౌరవ హై కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానం లో లోక్ అదాలత్ నిర్వహించి కక్షి దారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తద్వారా ఇటువంటి లోక్ అదాలత్ లు ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఆమేరకు ముందుగా సమావేశం నిర్వహించి రాజీ చేయడం ద్వారా ఈరోజు ఆమేరకు అవార్డు జారీ చేశామన్నారు.
అన్ని రకాలైన రాజీ పడతగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గం ద్వారా పరిహారం చెల్లించాలని అవార్డ్ ఇవ్వడం జరిగిందన్నారు . కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మోడల్ చెక్కు పంపిణీ చేస్తామని ముందుకు రావడం అభినందనీయం అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణం రాజీ చెయ్యడం వల్ల ఉభయులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇందు వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ లకు కూడా ఎంతో మేలు జరిగే అంశం అని గంధం సునీత పేర్కొన్నారు. ప్రజల్లో, కక్షి దారుల్లో లోక్ అదాలత్ లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం లో సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఇరు పక్షాల మధ్య రాజీ మార్గం ద్వారా ఈరోజు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ బెంచ్ కు వొచ్చిన కేసులకు పరిష్కారం చూపి ఆమేరకు అవార్డ్ ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు – 1013 , సివిల్ కేసులు – 379 , ప్రీ లిటిగేషన్ కేసులు – 121 ఉమ్మడి తూ.గో. జిల్లాలో పరిష్కారమైన మొత్తం కేసులు 1513 లకి చెందిన పరిహారం దాదాపు రూ.2.కోట్లు 30 లక్షలు అవార్డు జారీ చేసినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో భర్త మరణిచడంతో “తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం మరియు మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానము” నందు భార్య, ఆమె కుమార్తెలు మరియు ఆమె అత్తగారు 2021 సంవత్సరంలో కేసు వేసినట్లు శ్రీమతి. యార్లగడ్డ బృంద దేవి (ఓఎన్జీసి ఉద్యోగి స్వర్గీయ సురేష్ బాబు భార్య) చెప్పారు. అయితే తమ కేసుని రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా అవకాశం దొరికిందన్నారు. ప్రధాన న్యాయమూర్తి కి ధన్యవాదాలు తెలుపుకున్నారు. జాతీయ లోక్ అదాలత్, ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా కేసుల పరిష్కారం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయని డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కే.. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో న్యాయ మూర్తులు , ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, కక్షిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.