ఘనంగా పొట్టి శ్రీరాములు 124వ జయంతి నివాళులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ మాధవీ లత డిఆర్ఓ జి. నరసింహులు జిల్లా అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు లేసి ఘనంగా నివాళులు అర్పించారు

ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ప్రాణాలు అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి పట్టుదలతో ఉద్యమించారన్నారు. స్వాతంత్రం అనంతరం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని వివరించారు. జాతి అభివృద్ధిని కాంక్షిస్తూ భాష ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని అవిశ్రాంత ఉద్యమం చేశారన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు కాపాడటానికే ఆయన నడిపిన ఉద్యమాలు చరిత్రలో నిలిచాయన్నారు. అలాంటి గొప్ప నాయకుల జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *