Breaking News

సెక్టార్ అధికారులు, ఎంసిసి అధికారులతో సమీక్షా సమావేశం….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల కోడ్ శనివారం నుండే అమలులో ఉంటుందని, నగరంలో రాజకీయ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తక్షణం తొలగించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, ఎంసిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ మేరకు 24 గంటల్లో నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు తొలగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్లు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు అన్నింటినీ వెంటనే తొలగించాలని ఆదేశించారు. సెక్టారల్ అధికారులు కూడా తమ పరిధిలో ఎంసిసి అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో అన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీల పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ ని యుద్దప్రాతిపదికన తొలగించడం జరిగింది. రాజకీయ నాయకుల విగ్రహాలకు తెల్లటి క్లాత్ తో ముసుగులు తొడగాలన్నారు. వార్డ్ సచివాలయాల్లో, నగర పాలక సంస్థ కార్యాలయాల్లోని కౌన్సిల్ సమావేశ మందిరం, మీటింగ్ హాల్స్, విభాగాధిపతుల చంబర్లు, అన్ని విభాగాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను తొలగించాలన్నారు. వాటర్ టాంకర్లు,పారిశుధ్య వాహనాలు మరియు నగర పాలక సంస్థ వాహనాల పై కూడా రాజకీయ గుర్తులతో కూడిన ష్టిక్కర్లు ఉంటె తొలగించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించిన, లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నా, ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.
సమావేశంలో ఏఆర్ఓలు సిహెచ్.శ్రీనివాస్, ప్రదీప్ కుమార్, వెంకట లక్ష్మీ, సెక్టారల్ అధికారులు, ఎంసిసి అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *