-స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్
-రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది- ఎమ్మెల్యే కొడాలి నాని
-గుడుల వాడగా పేరుగాంచిన గుడివాడలో, దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయి – ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శనివారం ఉదయం ఘనంగా జరిగాయి. కమిటీ సభ్యులుగా పుల్లేటికుర్తి వెంకట కృష్ణారావు,యర్రమల్ల వెంకటకృష్ణ, బేరా వెంకటలక్ష్మి, కొమ్ము విజయలక్ష్మి, ముద్ర జయశ్రీ, వడ్లాది నాంచారమ్మలు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఎమ్మెల్యే నాని, చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్ లకు దేవదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగ వేద పండితులు, వేద ఆశీర్వచనాలు అందచేసి దేవస్థానం సాంప్రదాయం ప్రకారం గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కమిటీ సభ్యుల అభినందన సమావేశంలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ సీఎం జగన్ సహకారం, భక్తుల భాగస్వామ్యంతో గుడివాడ చరిత్రలో నిలిచిపోయేలా దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ధర్మకర్తల కమిటీలు భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనలు పెరిగేలా, దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే కొడాలి నాని సూచించారు. గుడివాడలో ఎంతో చరిత్ర కలిగిన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ఆకాంక్షించారు. అనంతరం కమిటీ సభ్యులను భక్తులు, వైఎస్ఆర్సిపి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, రాష్ట్ర యూత్ కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం, వైసీపీ నాయకులు పాలేటి చంటి, తోట శివాజీ, చుండూరి శేఖర్, వడ్లాని సుధాకర్, పంచకర్ల వెంకట్, దేవస్థాన ఇఓ ప్రసాద్ పెద్ద సంఖ్యలో భక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News