Breaking News

ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు…..

-పార్టీ కండువాలు కప్పి టిడిపి, జనసేన మైనార్టీ నేతలను….వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్….
-సీఎం జగన్ పై ప్రజలందరూ పూర్తి విశ్వాసంతో ఉన్నారు…. సింహాద్రి చంద్రశేఖర్
-ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, మాకు భగవంతుడు దీవెనలు… ప్రజల ఆశీస్సులు ఉన్నాయి – ఎమ్మెల్యే కొడాలి నాని

గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో టిడిపి యువ నేత ఎండి మతిన్ ,జనసేన మహిళా నేత షేక్ దిల్దార్ నాయకత్వంలో వందమంది మైనార్టీ మహిళలు,యువత ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావు సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మైనార్టీ యువత, మహిళలకు ఎమ్మెల్యే కొడాలి నాని, సింహాద్రి చంద్రశేఖర్ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే నాని, చంద్రశేఖర్ ను గజ మాలలతో మైనార్టీ యువత ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వం చేసిన మంచి, అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజానీకం వైసీపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. అధికార దాహంతో ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ, రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలబడి భారీ మెజార్టీలతో గెలిపించాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. నేడు పెద్ద ఎత్తున వైసీపీలో చేరిన మైనార్టీ సోదరీమణులు, యువతకు ఎమ్మెల్యే నాని రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు వైసీపీలో చేరడం శుభ పరిణామం అని ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. ముస్లిం సోదరులందరూ జగన్ మళ్ళీ సీఎం కావాలని ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, వైసిపి నాయకులు పాలేటి చంటి, మైనార్టీ సెల్ నాయకులు రజాక్ బాషా, ఫజల్, అలీ బెగ్,రిజ్వాన్ షరీఫ్, ఖాజ ఎండీ సాలెహా,మున్నా, పెద్ద సంఖ్యలో మైనార్టీ మహిళలు, యువత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *