Breaking News

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన……. ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్

-వేలాదిగా పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు….ప్రజానీకం
-నూటికి నూరు శాతం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్…. ఎమ్మెల్యేగా నేను గెలిచి తీరుతాం….
-పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులు, పైన ఉన్న భగవంతుడు దీవెనలు మాపై ఉండాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నా….
-వైసీపీ నాయకులతో కలిసి పనిచేయడం సంతోషకరం…. సింహాద్రి చంద్రశేఖర్
-మోసం చేయకుండా, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తానని మాట ఇస్తున్నా….

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులో గుడివాడ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తొలుత ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం పార్లమెంట్ వైసిపి ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్, ప్రారంభోత్సవ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సోదరుడు కొడాలి చిన్ని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ తో కలిసి, వేలాదిగా పాల్గొన్న పార్టీ శ్రేణుల జయ జయ ధ్వానాల మధ్య, ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం మత సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే నాని, చంద్రశేఖర్ ను మైనార్టీ పెద్దలు సత్కరించగా, నూతన కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ఇరువురు నాయకులు పాల్గొని, మత పెద్దలు, వేద పండితులు, దైవ సేవకుల వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ప్రాంగణంలోని గదుల్లో ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూవైసీపీ గెలుపుకు ఎన్నికల కార్యాలయం నుండి పనిచేస్తామన్నారు.మంచి వ్యక్తి, సేవా తత్పరుడు అయినా సింహాద్రి చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంసంతోషకరమన్నారు.దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులతో నూటికి నూరు శాతం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేగా నేను గెలిచి తీరతామని కొడాలి నాని పేర్కొన్నారు.జగన్ పాలనకు ఐదేళ్లు పూర్తయ్యాయన్నారు.సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని, జిల్లా సీఎం జగన్ ఎంతో ముందుకు తీసుకెళ్లారని ఎమ్మెల్యే నాని కొనియాడారు.గత ప్రభుత్వాలు శంకుస్థాపనలకే పరిమితమైన పోర్టును పూర్తి చేసామని, జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకు వచ్చామని ఆయన తెలియచేశారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసిన మేలు, మంచిని చెబుతూ….. రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు.పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులు, పైన ఉన్న భగవంతుడు దీవెనలు మాపై ఉండాలని చేతులెత్తి ప్రార్థిస్తునన్నారు. ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నాయకులందరితో కలిసి పని చేస్తానన్నారు.కొడాలి నానితో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ప్రజలను మోసం చేయకుండా, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తానని హృదయపూర్వకంగా చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ, సీఎం జగన్ కోసం, మా కోసం ప్రార్థించాలని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. కార్యాలయా ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను,వైసిపి జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, జడ్పిటిసిలు గొల్ల రామకృష్ణ, ఎంపీపీ గద్దె పుష్ప రాణి,కందుల దుర్గా కుమారి,మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, ఎంపీపీ పేయ్యల ఆదాం,వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, రాష్ట్ర యూత్ కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం, నియోజకవర్గ ప్రజలను వైసీపీ నాయకులు జోగా సూర్య ప్రకాష రావు, పాలేటి చంటి, సింగిరెడ్డి గగరిన్, గంట శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, మొండ్రు వెంకటేశ్వరరావు, పూడి సుధాకర్, కోంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్, చిగురుపాటి విక్టర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, అలీ బేగ్,ఎండి యాకూబ్, వెంపటి సైమన్,కంటిపూడి రవికుమార్, కట్టా రాంబాబు, తోటా ప్రసాద్, అల్లం రామ్మోహన్రావు, కోటప్రోలు నాగు, డొక్కు రాంబాబు,
వంగలపూడి కనక బాబు, లోయ రాజేష్, దోమ రఘు, రమణకుమార్, వీరిశెట్టి నరసింహారావు,ఆవుల నరేంద్ర, వల్లూరిపల్లి సుధాకర్, మురళి, నైనవరపు శేషుబాబు, పంచకర్ల వెంకట్, పార్టీ సల్మాన్ రాజు, అగస్త్య రాజు కృష్ణమోహన్, గుదే రవి, కలపాల కిరణ్, కుంభం నాగమణి,పిఎసిఎస్ అధ్యక్షుడు దుగ్గిరాల శేషుబాబు, చుక్క నాగలక్ష్మి, గుడివాడ వైస్ ఎంపీపీ బట్టు నాగమల్లేశ్వరి, జోగా నాగేశ్వరరావు, రజాక్ భాష, షేక్ ఫజల్, మహమ్మద్ ఖాసిం అబు, సర్దార్ బేక్, ఊడేడ్ల ఉమా, పిఎసిఎస్ అధ్యక్షుడు ఇమ్మడి అశోక్, బొజ్జగాని కోటమ్మ, కందుల నాగరాజు,డాక్టర్ బండారు శ్యాం కుమార్, చిన నారాయణరెడ్డి, మాల కొండారెడ్డి, తోట సాయికుమార్, అడపా పండు, రాలీ నాగరాజు, పుల్లేటికుర్తి కృష్ణ,మామిళ్ళ ఎలీషా,సురేఖ తాళ్లూరి ప్రశాంత్,కొండపల్లి కుమార్ రెడ్డి, తోట రాజేష్, పొట్లూరి మురళీధర్, మచ్చ పద్మ,సరేల్లనాగేశ్వరరావు, జ్యోతుల మణికంఠ, జూనియర్ జమదగ్ని, పుల్లేటికుర్తి వినయ్, కాకొల్లు ప్రసాద్, క్రేన్ బాబి, మాతంగి మమ్మీ, ఇమ్మడి నరసింహారావు, మహమ్మద్ జహీరుద్దీన్, ఖాదర్ బేగ్, నవభారత్ గఫార్ , కంచర్ల జగన్,తమ్మినేని రోమేశ్వర రావు,తిదుడ్డు చిన్నా, కొల్లిపర సాయి సుబ్రహ్మణ్యం, వడ్లాని సుధాకర్, రవి స్వీట్స్ మోహన్, చింతాడ నాగూర్, మామిళ్ళ రాజేష్, వైసీపీ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పవన్, గంట సురేష్, డాక్టర్ ఆర్కే, దారం నరసింహారావు, సింహాద్రి రాంబాబు, అల్లం సూర్యప్రభ, కొర్నిపాటి గణపతి, దారం కాంచన కుమారి, జ్యోతుల సత్యవేణి, వెంపల అప్పారావు,గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ టౌన్, అరేయ్ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *