గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
గోపాలపురం మండలంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లే రహదారులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మొదటిగా గోపాలపురం గ్రామంలో 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో గోపాలపురం నుండి గుడ్డిగూడెం పోవు రహదారికి శంకుస్థాపన చేశారు. కోమటిగుంట గ్రామంలో 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పి.జే. రోడ్డు నుండి కోమటిగుంట వరకు రహదారికి శంకుస్థాపన చేశారు. కరిచర్లగూడెం గ్రామంలో 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కరిచర్లగూడెం నుండి సంజీవపురం పోవు రహదారికి శంకుస్థాపన చేశారు. పెద్దాపురం గ్రామంలో 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పెద్దాపురం నుండి బంధపురం వరకు రహదారికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమాలు అనంతరం భీమోలు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …