Breaking News

పొట్టి శ్రీరాములుకు గాంధీ నాగరాజన్‌ నివాళి…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరామలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాంధీదేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీనాగరాజన్‌ పిలుపునిచ్చారు. శనివారం అమరజీవి పొట్టి శ్రీరామలు జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా, తెనాలిలో గాంధీచౌక్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరామలు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌.ఆర్‌.గాంధీనాగరాజన్‌ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం పొట్టి శ్రీరాములు తృణప్రాయంగా త్యాగం చేశారని అన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వీడి ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పన కోసం అమరజీవి స్ఫూర్తితో నాయకులు పనిచేయాలని ఆయన కోరారు. అమరజీవి స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో మంచి వారిని ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *