Breaking News

దేవునితో ఒక్కరోజు కూడిక

-సహాయ మాత దేవాలయం నందు ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలు

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఇబ్రహీంపట్నం సహాయ మాత దేవాలయం నందు విచారణ గురువు అనిల్ ఎం ఎస్ ఎఫ్ ఎస్ చే దేవాలయము నందు ఆదివారము ఉదయం తొమ్మిది గంటల నుండి ఒక్కరోజు ప్రభువుతో ఉపవాస కూడికలను నిర్వహించారు. హైదరాబాద్ చెందిన విసి గురువు జైసన్ చే విశ్వాసంతో కూడిన ప్రభు తో ఒక్కరోజు కూడికను నడిపించారు. ఉదయం 9 గంటల నుండి వాక్య సందేశాన్ని ప్రజలకు అందించారు. దేవుడు మనము ఏ స్థితిలో ఉన్న, మనలను విడువడు, ఎడబాయడు, ఆయన మనము మొరపెట్టుకున్న ప్రతి దానిని ఆలకించువాడు, దానిని నెరవేర్చువాడు, ఆయన నామమున సమస్తము సాధ్యమే అని, కానీ మన పాపములు మనకు దేవునికి మధ్య అడ్డముగానున్నవి, వాటిని మనము సరి చేసుకునేందుకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం అని, ఆ అవకాశమే ఈ తపస్సు కాల కాలమని, ప్రతి ఒక్కరూ చేసిన తప్పులను, పొరపాటులను, దేవుని ఎదుట మోకా కాళ్ళ మీద నిలబడి కన్నీటితో దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాప పడాలని, దేవునిచే ఎన్నుకోబడిన గురువుల ఎదుట మన పాపములను ఒప్పుకొని
పాప సంకీర్తన చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలని అన్నారు. అంతేకాకుండా ఏసుప్రభు శిలువపై పొందిన గాయములను ఒక్కొక్కటిగా వివరించారు. క్రీస్తు ప్రభువు మానవాళి పాప రక్షణార్థమై సిలువలో మరణించారని, మరణించి మూడో నాడు ఉత్సానము అయ్యారని, ఈ ఉపవాస కూడికల ద్వారా మనము దేవునికి దగ్గర అవ్వాలని, దేవుడితో సంభాషించాలని, దేవునితో నడవాలని, ప్రతి ఒక్కరూ ఈ తపస్సు కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రార్థనల ద్వారా, ప్రభువుకు దగ్గరవుతుంటాం, మంచిదే కానీ మనలో ఉన్న చెడు తలంపులను, చెడు ఆలోచనలను, మనము తెలిసి తెలియక చేసిన తప్పులను, ఒప్పుకోవటానికి దేవుడు ఇచ్చిన అవకాశం పాప సంకీర్తన , దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ముందు మనం చేసిన తప్పులు అన్నిటిని ప్రభు ఎదుట ఒప్పుకొని మంచి పాప సంకీర్తనలు చేసి ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని తెలిపారు. ఆరాధన సమయంలో వివిధ గురువుల చే పాప సంకీర్తన సమయాన్ని కల్పించారు. ఉదయం 9 గంటల నుండి దివ్య సప్రసాద ఆశీర్వాదము నిర్వహించారు, అనంతరం స్వస్థత ప్రార్థనలు, తైలాభిషేకం, అనంతరం విచారణ గురువు బెల్లంకొండ అనిల్ కుమార్, ఫాదర్ జైసన్, మెండెం జోసఫ్, నాగోతు జీవన్ చే సమిష్టి దివ్య బలి పూజను నిర్వహించారు. అనంతరం ఉపవాస కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చక్కటి ప్రేమ విందును ఏర్పాటు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *