Breaking News

తూర్పు నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో తూర్పు నియోజకవర్గ ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆదివారం విజయవాడ నక్షత్ర కన్వెన్షన్ నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్ ఎల్ సి రుహుల్లా హాజరయ్యారు. ఈ సందర్బముగా ముఖ్య అతిథులు, వక్తలు మాట్లాడుతూ  వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి సంక్షేమం కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా దేవినేని అవినాష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పదేళ్లు ఎమ్మెల్యే గా ఉండి కూడా చేయలేని పనులు అవినాష్ ఈ ఐదేళ్లలో చేసి చూపించారన్నారు. క్రిష్ణలంక వాసుల వరద ముంపు కష్టాలను పరిష్కరించిన ఘనత అవినాష్ దే. అంతేకాకుండా రిటైనింగ్ వాల్ దగ్గర పార్క్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్యే కాకముందే ఇంత చేసిన అవినాష్ కు మనమంతా మద్దతుగా నిలిచి ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇంకెంత చేయగలడు అనేది ఆలోచించాలన్నారు. ఆర్యవైశ్య లకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత కల్పించి అనేక పదవులు, దేవాలయాల కమిటీలలో స్థానం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిధాలా సహకరించిన వెల్లంపల్లి కి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం లో ఆర్యవైశ్యులకు అన్నివిధాలా న్యాయం జరిగింది. ఈబీసీ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి  తీసుకొనే ప్రతి నిర్ణయం లో వెల్లంపల్లి సలహాలు సూచనలు ఉంటాయన్నారు. విజయవాడ నగరంలో ఆర్యవైశ్యలకు వారు వ్యాపారం సజావుగా జరువుకోవడానికి మేము అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి. మీ నమ్మకం నిలబెట్టుకునే విధంగా పాలన చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది హాజరయ్యారని, ఇంతగా విజయవంతం కావటానికి అందరి సమిష్టి కృషే కారణమని అందరికి ధన్యవాదాలు తెలిపారు కమిటీ వారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, అర్బన్ వాణిజ్య విభాగ కార్యదర్శి శేగు వెంకటేశ్వర రావు, జాయింట్ సెక్రెటరీ వెలుగురి వెంకటేశ్వర్లు, సభ్యులు సురేష్, సాయి బాబు, బ్రహ్మము, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రమణయ్య,శేఖర్, వాసు, బైసాని సురేష్, కంభంపాటి లక్ష్మణరావు, కోట చెన్నయ్య, కార్పొరేటర్ తాడిపర్తి కొండారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *