Breaking News

తూర్పు నియోజకవర్గ ఉత్తరాంద్ర కాపు నాయకులతో ఆత్మీయ సమ్మేళనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక తూర్పు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ అబ్యర్ది దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం 14వ డివిజన్, రజకులు కళ్యణ మండపం వద్ద జరిగిన ఉత్తరాంద్ర తూర్పు కాపు నాయకులతో ఆత్మీయ సమావేశంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని తూర్పు కాపు సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం తూర్పు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థాయి కల్పించామని, నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ  ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న తూర్పు కాపు సోదరులు అందరూ వెన్నంటే నడిచారని నేడు ఆయన తనయుడిగా మీరంతా నాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీ మద్దతు ఇలాగే ఉండాలని మీకు ఏ అవసరం వచ్చిన తాను అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపాటి వెంకటేశ్వర రావు, 14వ డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గా ప్రసాద్ ,వైసీపీ నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *