-సి విజిల్ ఫిర్యాదులపై వేగవంతం మైన స్పందన ఉండాలి
– ఫిర్యాదులపై 24 గంటల్లో సమాధానం అందచేయాలి
-మేజీస్టిరియల్ అధికరణ కోసం ప్రతిపాదనలు పంపాలి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపధ్యంలో జిల్లా స్థాయి ఎన్నికల నిర్వహణా వ్యవస్థ కార్యకలాపా లకు అనుగుణంగా నియోజక వర్గ స్థాయిలో కార్యచరణ రూపొందించడం జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం వెలగపూడి నుంచీ ఏపి ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు . అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి (డి ఈ వో) నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులతో టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ ద్వారా ఎన్నికలను నిర్వహించే తేదీలను ప్రకటించిన నేపధ్యంలో అందరూ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని తెలిపారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో, బహిరంగ ప్రదేశాల్లో , ప్రభుత్వ కార్యాలయాలలో హోర్డింగ్‌లు, పోస్టర్లు, కట్ అవుట్‌ల తొలగింపు జరగకుండా ఉండడం దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. 24 గంటల్లో, 48 గంటల్లో, 72 గంటల్లో చేపట్టవలసిన తొలగింపు తదితర అంశాలపై తక్షణం స్పందించి చర్యలు పై నివేదికలు పంపాలని ఆదేశించారు. అలసత్వం వహించకుండా ఆర్వో లు, ఏ ఆర్వో లు, ఇతర బృందాలు కార్యచరణ లోకి రావాలని సూచించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు (FS), ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ (ESMS) పూర్తి స్థాయిలో విధుల్లో భాగస్వామ్యం అవ్వడం, పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించా లన్నారు. ఎన్నికల ప్రక్రియ లో తనిఖీల కోసం క్షేత్ర స్థాయిలో బాధ్యతలు నిర్వహించే ఎఫ్ ఏస్, ఎమ్ సి సి తదితర బృందాలలో సిబ్బందికి మేజిస్టిరియల్ అధికరణ ల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
సి – విజిల్ ద్వారా అందిన ఫిర్యాదు యొక్క స్థితిని ఫిర్యాదుదారుకు తెలియజేయడానికి నిర్ణీత వ్యవధిలో 100 నిమిషాల్లో ప్రతి స్పందన ఉండాలన్నారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందించిన వ్యక్తి వివరాలూ, ఎక్కడ నుంచి సంభందిత సమాచారం మీకు అందుబాటు లో ఉంటాయని, అక్కడికి సంభందిత ఎఫ్ యూ ( ఫంక్షనరీ యూనిట్) చేరుకుని స్పందించి యాప్ ద్వారా తదుపరి నివేదికను సమర్పించాలన్నారు. వీటిలో బృందం పేరు, ఫిర్యాదు తేదీ మరియు సమయం, స్థానం, స్థితి, ఫిర్యాదు రకం మరియు తేదీ మరియు నివేదిక సమయం సమగ్ర సమాచారం నమోదు అవ్వటం జరుగుతుందనీ అన్నారు.
వివిధ పత్రికల్లో, మాధ్యమాల్లో వొచ్చే వార్తల విషయములలో 24 గంటల్లోగా స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యవేక్షణ బాధ్యతలలో భాగంగా ఫిర్యాదు నిర్వహణ అప్లికేషన్ , యదార్థ స్థితి పై నివేదికను జత చేయాలన్నారు. జిల్లా ఎన్నికల నిర్వహణా వ్యవస్థ తరహాలో నియోజక వర్గ స్ధాయిలో కూడా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఎమ్ సి సి ల నిర్వహణా పై రోజువారీ నివేదికలు, నిర్ణీత పట్టికల్లో సమగ్ర సమాచారం ఎప్పటి కప్పుడు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నియోజక వర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు తదితర వివరాలకు చెందిన పెండింగ్ పనులు పూర్తి చేసి, సంపూర్ణ నివేదిక కమీషన్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు. వివిధ పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వొచ్చే ప్రతికూల వార్తలపై స్పందించి నివేదిక ఇవ్వాలనీ పేర్కొన్నారు.
ఈ సమావేశం లో మునిసిపల్ కమీషనర్ కే . దినేష్ కుమార్, డి ఆర్వో జి. నరసింహులు, రాజమండ్రీ పార్లమెంటు ఈ ఆర్వో ఆర్. కృష్ణా నాయక్, డి టి సునీల్ తదితరులు పాల్గొన్నారు.