-జిల్లాలో 25 కేంద్రాలలో పరీక్షల నిర్వహణా దరఖాస్తు చేసుకున్న 8, 258 మంది అభ్యర్థులు
-పేపర్ 1 కి హాజరైనా 5,056 (61.23 %) మంది అభ్యర్థులు
– పేపర్ 2 కి హాజరైనా 5,007 (60.63 %) మంది అభ్యర్థులు
-జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాలలో ఏ పి పి ఏస్ సి గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ , నోడల్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.
ఆదివారం ఉదయం ఐఎస్ టి ఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ , ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నందు పరీక్షా కేంద్రాలని జెసి తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు , ఆర్డీవో రాజమండ్రీ ఎ. చైత్ర వర్షిణి లు నగరంలోని పలు పరీక్షా కేంద్రాలని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ వివరాలు తెలియ చేస్తూ, జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 1 ఎపిపి ఎస్సి పరీక్షలను ఉదయం , మధ్యహ్నం రెండూ సెషన్స్ లో నిర్వహించటం జరిగిందన్నారు. 8,258 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోగా పేపర్ 1 కి ఉదయం 5,056 (61.23 %) మంది అభ్యర్థులు హాజరు కాగా 3202 మంది గైహాజరయ్యారు. పేపర్ 2 కి 5,007 (60.63 %) మంది హాజరు కాగా 3 251 మంది గైహాజరయ్యారు అని తెలియ చేశారు.
Prajavartha Online Telugu News