-కె.వి.రామారావు నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైఖ్య మరియు బీసీ సమైక్య మరియు యాదవ సంఘం సమైఖ్య పశ్చిమ నియోజకవర్గ ప్రజా అభిప్రాయ సేకరణ మేరకు నాయి బ్రాహ్మణులు, బిసి అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గం లో ఎవరైనాప్పటికీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు కె. వి.రామారావు నాయి, నాయి బ్రాహ్మణ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులు వివరించారు. అదే విధంగా రాష్ట్ర బిజెపి నాయకులు తో మరియు కేంద్ర బిజెపి నాయకులకు, మొన్న విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బిజెపి రాష్ట్ర నాయకులు గొల్లగాని రవికృష్ణ పేరు ప్రస్తావిస్తూ మెమోరాం అందజేసినట్లు, ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర ఇన్చార్జి నాయకుల పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. గొల్లగాని రవికృష్ణ రాష్ట్రంలో ప్రజాసేవలో పేరుగాంచిన వ్యక్తిగా అందరికీ విధేయతమే, గొల్లగాని చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆయుర్వేద వైద్య శిఖామణిగా పేరుగాంచిన నెల్లూరు కి చెందిన ఆనందయ్య వద్ద ముందు సేకరించి, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో కరోనా వ్యాధి నివారణకు ఆయుర్వేదంలో అనేక ప్రయోగాలు నిర్వహించటానికి సహకరించి ఉపశమనానికి మందు కనుగొని రాష్ట్రంలో ప్రజలందరి మన్ననలు పొందిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ప్రజలలో ప్రజాసేవకై ముందుండే వ్యక్తి కనుక రాష్ట్రంలో రాజకీయాల పొత్తుల్లో భాగంగా బిజెపి అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రకటించాలని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఆశిస్తున్నట్లు కె.వి.రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తురాల లీల వెంకట ప్రసాద్ యాదవ్ అఖిలభారత యాదవ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు చింతల కృష్ణ భారత యాదవ సంఘం ప్రచార కమిటీ అధ్యక్షుడు, మరియు బోట్ట నాగార్జున బీసీ యువజన నాయకుడు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.