Breaking News

పశ్చిమ జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ ను ప్రకటించాలని బలపరుస్తూ నగరాల ఆత్మీయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం లో జనసేన అభ్యర్థిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, పోతిన వెంకట మహేష్ ను ప్రకటించాలని మంగళవారం నగరాల కళ్యాణ మండపంలో నగరాల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగరాల సంఘం నాయకులు మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుండి పోతిన వెంకట మహేష్ పార్టీ ఉనికిని కాపాడుకుంటూ నేటి వరకు పశ్చిమ నియోజవర్గంలో ప్రజలకు అండదండగా ఉండి అనేక సమస్యలు పరిష్కరిస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేనున్నానని భరోసా ఇస్తున్న వ్యక్తి పోతిన వెంకట మహేష్ అని కొనియాడారు. అటువంటి వ్యక్తిని పొత్తుల్లో భాగంగా పశ్చిమ సీటుని వేరొకరికి కేటాయించడం సమంజసం కాదని పార్టీ అధిష్టానం పునర్ ఆలోచించి పోతిని మహేష్ కి జనసేన తరఫున సీటు కేటాయించాలని అభ్యర్థిస్తున్నామని పలువురు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ తన పట్ల అభిమానాన్ని చాటిచెప్పిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అవసరం అయితే జనాభిమానంతో రెబల్ అభ్యర్థిగానైనా పోటీచేయడానికి సిద్ధమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతిన బేసి కంటేశ్వరుడు, గుజ్జారి అమర్, తమ్మిన హేమంత్, రాంపిళ్ల శ్రీనివాస రావు , పిళ్ళా శ్రీనివాసరావు (పీసీ), లింగిపిల్లి రామకృష్ణ, సుఖాసి కిరణ్, ప్రముఖ న్యాయవాది గోగిశెట్టి వెంకటేశ్వరరావు, లింగి పిల్ల అప్పారావు , మరి పిల్ల హనుమంతరావు, తమ్మిన హేమంత్ కుమార్, రాంపిల్ల శ్రీను, గుజ్జారా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *